హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

JioFiber Plan | టాటా ఐపీఎల్ (Tata IPL) సందర్భంగా జియోఫైబర్ కేవలం రూ.198 ధరకే బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్‌ను ప్రకటించింది. 10ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home), ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర అవసరాల కోసం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నవారు ఉన్నారు. అయితే నిత్యం ఇంటర్నెట్ పైనే పనిచేసేవారు ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచే కాకుండా, మరో కనెక్షన్ కూడా తీసుకుంటున్నారు. ఇలా బ్యాకప్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారి కోసం జియోఫైబర్ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.198 ధరకే బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్ (Broadband Back-Up Plan) ప్రకటించింది. టాటా ఐపీఎల్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 2023 మార్చి 30 నుంచి జియోఫైబర్ బ్యాకప్ కనెక్షన్ అందుబాటులో ఉంటుంది. మీకు దగ్గర్లోని జియో రీటైలర్ దగ్గర రూ.99 చెల్లించి బ్యాకప్ కనెక్షన్ బుక్ చేయొచ్చు.

రూ.198 బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్ తీసుకునేవారికి 10ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఉచితంగా ల్యాండ్‌లైన్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి స్పీడ్ అప్‌గ్రేడ్, ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌గ్రేడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 10 ఎంబీపీఎస్ నుంచి 30ఎంబీపీఎస్ లేదా 100ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 1 రోజుకు, 2 రోజులకు, 7 రోజులకు అప్‌గ్రేడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 10 ఎంబీపీఎస్ నుంచి 30ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయాలంటే ఒక రోజుకు రూ.21, రెండు రోజులకు రూ.31, ఏడు రోజులకు రూ.101 చెల్లించాలి. 10 ఎంబీపీఎస్ నుంచి 100ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయాలంటే ఒక రోజుకు రూ.32, రెండు రోజులకు రూ.52, ఏడు రోజులకు రూ.152 చెల్లించాలి.

AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి

ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌గ్రేడ్ విషయానికి వస్తే నెలకు రూ.100 చెల్లించి సెట్ టాప్ బాక్స్ అప్‌గ్రేడ్ చేస్తే ఉచితంగా సెట్ టాప్ బాక్స్, 400 లైవ్ టీవీ ఛానెల్స్, 6 ఓటీటీ యాప్స్ యాక్సెస్, యూట్యూబ్ యాక్సెస్ లభిస్తుంది. నెలకు రూ.200 చెల్లించి అప్‌గ్రేడ్ చేస్తే ఉచితంగా సెట్ టాప్ బాక్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్, 14 ఓటీటీ యాప్స్ యాక్సెస్, యూట్యూబ్ యాక్సెస్ లభిస్తుంది. ఇక రూ.1490 చెల్లించి బ్యాకప్ ప్లాన్ తీసుకుంటే రూ.990 విలువైన ఐదు నెలల సర్వీస్, రూ.500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.

JioFiber Back-Up Plan, JioFiber Broadband Back-Up Plan, JioFiber Broadband plans, JioFiber IPL plans, JioFiber plans, JioFiber Rs 198 Back-Up Plan, జియోఫైబర్ 198 బ్యాకప్ ప్లాన్, జియోఫైబర్ ఐపీఎల్ ప్లాన్, జియోఫైబర్ ప్లాన్స్, జియోఫైబర్ బ్యాకప్ ప్లాన్, జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్, జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్

జియోఫైబర్‌లో ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా ప్లాన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నెలకు రూ.298 చెల్లిస్తే 10ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 6 ఓటీటీ యాప్స్, 400 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.398 చెల్లిస్తే 10ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 14 ఓటీటీ యాప్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.499 చెల్లిస్తే 30ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 6 ఓటీటీ యాప్స్, 400 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.599 చెల్లిస్తే 30ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 14 ఓటీటీ యాప్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

Price Cut: ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... లేటెస్ట్ రేట్స్ ఇవే

నెలకు రూ.799 చెల్లిస్తే 100ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 6 ఓటీటీ యాప్స్, 400 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.899 చెల్లిస్తే 100ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 14 ఓటీటీ యాప్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.999 చెల్లిస్తే 150ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 15 ఓటీటీ యాప్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

నెలకు రూ.1499 చెల్లిస్తే 300ఎంబీపీఎస్ ప్లాన్ లభిస్తుంది. 16 ఓటీటీ యాప్స్, 550 లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.

First published:

Tags: IPL 2023, JioFiber, Reliance Jio

ఉత్తమ కథలు