ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం లేదా పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటున్నారా? రిలయెన్స్ జియోకు చెందిన జియోఫైబర్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ అందిస్తోంది. గతేడాది రూ.399 నుంచి సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించిన జియోఫైబర్ అప్పుడే 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా ప్రకటించింది. ఎవరైనా ఈ 30 రోజుల ట్రయల్ ఆఫర్ పొందొచ్చు. ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. వారికి 4కే సెట్ టాప్ బాక్స్ కూడా ఉచితంగా లభిస్తుంది. 13 ఓటీటీ యాప్స్‌కి సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. ముందుగా డబ్బులు చెల్లించి జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలి. 30 రోజుల తర్వాత సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. వారికి రీఫండ్ వస్తుంది. ఒకవేళ కనెక్షన్ కొనసాగించాలనుకుంటే రూ.399 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్స్‌లో ఏదైనా ఓ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది
Smartphones Under Rs 20,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.20,000 లోపు 7 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
ముందుగా https://www.jio.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో JioFiber పైన క్లిక్ చేయండి.
FREE 30-DAY TRIAL బ్యానర్ పైన క్లిక్ చేయండి.
అందులో మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
ఆ తర్వాత మీ పూర్తి అడ్రస్ సెలెక్ట్ చేయాలి.
సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే
Realme: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు లాంఛింగ్
మీకు జియోఫైబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ తర్వాత మీరు కోరుకున్న అడ్రస్‌లో జియోఫైబర్ కనెక్షన్ తీసుకోవచ్చు. ప్రతీ ప్లాన్‌కు తగ్గట్టుగా ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. జియోఫైబర్ ఫ్రీ ట్రయల్‌లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రూ.2,500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే వైఫై మోడెమ్, 4కే సెట్ టప్ బాక్స్ లభిస్తుంది. 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. డిస్నీ హాట్‌స్టార్+, సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్, లయన్స్‌గేట్, సన్ నెక్స్‌ట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, ఎరోస్ నౌ, జియోసినిమా లాంటి 13 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం. ఇక రూ.1,500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే 4కే సెట్ టప్ బాక్స్, 13 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ యాక్సెస్ లభించదు. జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ వివరాల కోసం https://www.jio.com/fiber/en-in/plans వెబ్‌సైట్ చూడండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Internet, Jio, JioFiber, Reliance Jio, Work From Home