JIOFIBER HIGH SPEED BROADBAND SERVICES EXPANDS TO 71 TOWNS IN TELANGANA AND ANDHRA PRADESH SS
JioFiber: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 71 పట్టణాలకు జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ
JioFiber: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 71 పట్టణాలకు జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ
(image: Jio)
JioFiber | ఇంటికి లేదా ఆఫీసుకి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియోఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (JioFiber Broadband) సేవలు 71 పట్టణాలకు విస్తరించాయి.
దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో ఫైబర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాలను చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో పటిష్ఠ ఉనికితో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులలో కూడా జియో ఫైబర్ లభ్యమవుతుంది.
తెలంగాణలో కూడా జియోఫైబర్ 28 నగరాలు, పట్టణాలకు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ మాత్రమే గాకుండా ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్ లలో కూడా లభ్యమవుతుంది. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది.
జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తో డ్పడింది. విశ్వసించదగిన, తిరుగులేని హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ తో వారికి ఎంతో ప్రయోజనం కలిగించింది. ఎంతో మంది వృత్తినిపుణులు మరీ ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందిన వారు రాష్ట్రంలోని తమ స్వస్థలా ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎంతో సజావుగా తమ పనులు చేసుకోగలుగుతున్నారు. ఈ పట్టణాల్లోని ఎన్నో చిన్న సంస్థలు, విద్యాసంస్థలు తమ వ్యాపారాలు, వృత్తుల డిమాండ్లకు అనుగుణంగా డిజిటల్ విధానం లోకి మారిపోగలిగాయి.
నూతన పోస్ట్ పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్ స్టాలేషన్ లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్ టెయిన్ మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్ కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్ ను చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జియో ఫైబర్ ఇళ్లు మొదలుకొని చిన్న, పెద్ద సంస్థలు, వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులతో సహా లక్షలాది మంది వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది. అపరిమిత వినోదం, వార్తలు, ఆరోగ్యం, చదువు లాంటివాటికి వేదికగా నిలుస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.