హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JioPhone | మీ దగ్గర జియోఫోన్ ఉందా? అయితే మీరు రూ.50,000 గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  జియోఫోన్ యూజర్లకు శుభవార్త. రూ.50,000 వరకు గెలుచుకునే అద్భుతమైన అవకాశం ఇది. జియోఫోన్ యూజర్లు అందరికీ జియోక్రెకిట్ యాప్‌ను లాంఛ్ చేసింది రిలయెన్స్ జియో. జియోఫోన్ యూజర్లు ఇక తమ ఫోన్‌లోనే క్రికెట్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. జియో 4జీ ఫోన్లలో జియోక్రికెట్ యాప్ డౌన్‌లోడ్ చేసి వాడుకోవచ్చు. KaiOS ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. జియోక్రికెట్ యాప్‌తో లైవ్ క్రికెట్ స్కోర్, మ్యాచ్ అప్‌డేట్స్, న్యూస్, వీడియోలు, క్రికెట్‌కు సంబంధించిన కంటెంట్ చూడొచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాలవారు ఇంగ్లీష్‌లోనే కాదు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, బంగ్లా, గుజరాతీ, మళయాళం, మరాఠీ భాషల్లో కంటెంట్ చూడొచ్చు. జియోక్రికెట్ యాప్‌లో కంటెంట్ చూడటంతో పాటు జియోక్రికెట్ ప్లేఎలాంగ్ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. జియోఫోన్‌లో క్రికెట్ అప్‌డేట్స్ తెలుసుకోవడంతో పాటు జియోక్రికెట్ ప్లేఎలాంగ్ కాంటెస్ట్‌లో పాల్గొనాలంటే KaiOS యాప్ స్టోర్ నుంచి జియోక్రికెట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే

  Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

  యూజర్లు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ బాల్‌కు ఏం జరగనుందో అంచనా వేయాలి. కరెక్ట్‌గా గెస్ చేసినవారు బహుమతులు గెలుచుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలో ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. దీంతో పాటు ఇతర స్పెషల్ కాంటెస్ట్‌లు కూడా ఉంటాయి. వీటిలో స్పెషల్ క్విజ్, డైలీ రివార్డ్ డ్రా లాంటివి ఉంటాయి. జియోక్రికెట్ యాప్ ద్వారా రిలయెన్స్ నుంచి రూ.10,000 విలువైన డైలీ గిఫ్ట్ వోచర్స్ గెలుచుకోవచ్చు. జియోక్రికెట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్, ఏడాది కాంప్లిమెంటరీ జియో రీఛార్జ్ లాంటి రివార్డ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు రోజూ రూ.10,000 విలువైన గిఫ్ట్ వోచర్, టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ గెలుచుకోవచ్చు. మొత్తం క్రికెట్ సీజన్‌లో బంపర్ ప్రైజ్ కూడా ఉంటుంది. జియో క్రికెట్ లక్కీ విన్నర్స్ రూ.50,000 విలువైన రిలయెన్స్ గిఫ్ట్ వోచర్స్ గెలుచుకోవచ్చు.

  Oppo A33: భారీ డిస్కౌంట్‌తో ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్ సేల్

  Android apps: అలర్ట్... వెంటనే ఈ 21 యాప్స్ డిలిట్ చేయండి

  జియోఫోన్ ధర రూ.699 మాత్రమే. ఈ ఫోన్ కొన్నవారికి రూ.693 బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ఫీచర్ ఫోన్‌లో 4జీ నెట్వర్క్, హెచ్‌డీ వాయిస్, ఉచితంగా వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా లాంటి సేవలు పొందొచ్చు. 18 భాషల్లో ఈ ఫోన్ ఉపయోగించొచ్చు. మైజియో, జియోటీవీ, జియోసినిమా, జియోసావన్, గూగుల్ అసిస్టెంట్, జియోవీడియోకాల్, మెసేజెస్, జియోగేమ్స్, జియోరైల్, వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్ ఉపయోగించొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Cricket, IPL, IPL 2020, Jio, Jio phone, Reliance Jio

  ఉత్తమ కథలు