JIO UPI AUTOPAY RELIANCE JIO CUSTOMERS CAN USE AUTOPAY FEATURE TO PREPAID RECHARGES AND POSTPAID BILL PAYMENTS SS
Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు
Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు
(ప్రతీకాత్మక చిత్రం)
Reliance Jio | మీరు జియో కస్టమరా? ప్రతీ నెలా రీఛార్జ్ చేస్తుంటారా? లేక మూడు నెలలకోసారి ప్రీపెయిడ్ ప్లాన్ (Jio Prepaid Plan) రీఛార్జ్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక మీరు ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు శుభవార్త. మరో అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది జియో. యూపీఐ ఆటోపే (UPI AUTOPAY) ఫీచర్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), జియో కలిసి ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఈ ఫీచర్ తీసుకొచ్చిన తొలి టెలికాం కంపెనీ జియో కావడం విశేషం. ఈ ఫీచర్ వాడుకోవడానికి యూజర్లు మైజియో యాప్‌లో యూపీఐ ఆటోపే ఎనేబుల్ చేసి స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. యూజర్లు తాము రీఛార్జ్ చేయాలనుకున్న ప్లాన్స్‌ను సెలెక్ట్ చేసి ఆటోపే ఫీచర్ ఎనేబుల్ చేస్తే చాలు... ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమెటిక్‌గా రీఛార్జ్ అవుతుంది.
జియో యూజర్లు రూ.5,000 వరకు రీఛార్జ్ చేయొచ్చు. రీఛార్జ్ సక్సెస్ కావడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూజర్లను యాడ్ చేయొచ్చు. రీఛార్జ్‌కు సంబంధించిన వివరాలను మాడిఫై చేయొచ్చు. జియో యూజర్లు కావాల్సినప్పుడు ఇ-మ్యాండేట్ తొలగించొచ్చు. రీఛార్జ్ చేయాల్సిన తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వేలిడిటీ పూర్తవుతుండగానే ఆటోమెటిక్‌గా రీఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.
Vivo V23 Pro 5G: వివో వీ23 ప్రో 5జీ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లోనే రూ.3,000 డిస్కౌంట్
Jio UPI Autopay: జియో యూపీఐ ఆటోపే ఫీచర్ వాడుకోండి ఇలా
Step 1-రిలయన్స్ జియో యూజర్లు ముందుగా మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేయాలి.
Step 2- తమ జియో నెంబర్‌తో లాగిన్ కావాలి.
Step 3- హోమ్ స్క్రీన్‌లో మొబైల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
Step 4- రీఛార్జ్ అండ్ పేమెంట్స్ సెక్షన్‌లో జియో ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- జియో ఆటోపే యాక్టివేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
Step 6- మెనూలో నుంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
యూపీఐ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఆ తర్వాత మీ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
Step 9- వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఆటోపే ఎనేబుల్ అవుతుంది.
జియో యూపీఐ ఆటోపే ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ప్లాన్ ఆటోమెటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. మీరు ప్లాన్ మార్చాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చుకోవచ్చు. రూ.5,000 లోపు రీఛార్జుల కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. రూ.5,000 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయాలనుకుంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్లకు పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. ప్రీపెయిడ్ యూజర్లు మాత్రమే కాదు... పోస్ట్‌పెయిడ్ యూజర్లు కూడా ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా తమ పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్ ఆటోమెటిక్‌గా చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.