రిలయన్స్ జియో గత నెలలో జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 5జీ సేవల్ని అందించడంలో జియో సరికొత్త రికార్డ్ సృష్టించింది. దేశరాజధాని అంతటా 5జీ సేవలు అందిస్తున్న తొలి టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో (Reliance Jio) రికార్డు సృష్టించింది. జియో ట్రూ 5జీ సేవలు ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా లభిస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. జియో అత్యంత అధునాతన ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ దేశరాజధాని అంతటా 5జీ సేవల్ని అందిస్తుండటం విశేషం.
రెసిడెన్షియల్ ఏరియాలు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, రద్దీగా ఉండే వీధులు, మాల్స్, మార్కెట్స్, రద్దీ ఎక్కువగా ఉండే పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు, టెక్ పార్క్స్, రోడ్లు, రహదారులు, మెట్రోలకు జియో 5జీ సేవలు లభిస్తున్నాయి. వీటికి మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు కూడా జియో 5జీ సేవలు విస్తరించడం విశేషం.
Vivo Offer: కలర్ మారే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే కొనండి
జాతీయ రాజధాని, NCR ప్రాంతంలోని మెజారిటీ ప్రాంతాలను కవర్ చేయడం మాకు గర్వకారణం. జియో తన ట్రూ 5జీ పరిధిని వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ట్రూ 5జీ నెట్వర్క్ ఎక్కువ ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం అంతటా 5జీ సేవల్ని అందిస్తున్న ఏకైక ఆపరేటర్ జియోనే. ప్రతి భారతీయునికి ట్రూ 5జీ సేవల్ని అందించడానికి జియో ఇంజనీర్లు 24 గంటలూ పని చేస్తున్నారంటే దానికి కారణం ఈ సాంకేతికత యొక్క పరివర్తన శక్తి
జియో అధికార ప్రతినిధి
ఢిల్లీ-ఎన్సీఆర్లోని లక్షలాది మంది యూజర్లకు జియో వెల్కమ్ ఆఫర్ లభిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా జియో యూజర్లు ఎలాంటి ఖర్చు లేకుండా 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు.
Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్స్ ఫీచర్ వచ్చేసింది... పోల్ ఇలా క్రియేట్ చేయాలి
జియో ట్రూ 5జీ విషయానికి వస్తే 4జీ నెట్‌వర్క్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందించే సత్తా జియోకు మాత్రమే ఉంది. 700 MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్స్ 5జీ స్పెక్ట్రమ్ జియో దగ్గర ఉంది. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5జీ ఫ్రీక్వెన్సీలను సజావుగా మిక్స్ చేసి ఒకే బలమైన డేటా హైవే మార్చే టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio 5G, Jio TRUE 5G, Reliance Jio