Jio: 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో టాప్: ట్రాయ్

Reliance Jio | 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో టాప్‌లో నిలిచింది. 2019 జనవరి నెలకు సంబంధించిన చార్ట్‌లో జియో మొదటి స్థానాన్ని సాధించింది.

news18-telugu
Updated: February 15, 2019, 8:07 PM IST
Jio: 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో టాప్: ట్రాయ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 15, 2019, 8:07 PM IST
4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో టాప్‌లో నిలిచింది. 2019 జనవరి నెలకు సంబంధించిన చార్ట్‌లో జియో మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విషయాన్ని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారికంగా ప్రకటించిన రిపోర్టులో ఈ మేరకు ధ్రువీకరించింది. జనవరి నెలలో జియో సగటున 18.8 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ నమోదు చేసినట్టు ట్రాయ్ తెలిపింది. టాప్ ప్లేస్‌లో నిలవడమే కాదు. జియో గతంలో కంటే మెరుగైన ప్రదర్శనను కూడా కనబరిచింది. 2018 డిసెంబర్‌లో జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 18.7 ఎంబీపీఎస్. ఈసారి దాన్ని అధిగమించింది. మరో ఘనతను కూడా జియో సాధించింది. 2018 ఏడాదికి సంబంధించి ఫాస్టెస్ట్ 4జీ ఆపరేటర్‌గా నిలిచింది.

Jio tops 4G download speed, Reliance Jio, Jio speed, Jio 4G, Jio Offers, Reliance Jio offers, Jio tops in 4G speed, 4G Phones, Jio news, Jio Updates, జియో 4జీ, రిలయన్స్ జియో, జియో న్యూస్, జియో ఆఫర్లు, రిలయన్స్ జియో ఆఫర్లు, జియో 4జీ స్పీడ్, ట్రాయ్, Telecom Regulatory Authority of India, Trai
ప్రతీకాత్మక చిత్రం


ట్రాయ్ ప్రకటించిన చార్ట్‌లో జియో టాప్ ప్లేస్‌లోకి రాగా, భారతి ఎయిర్‌టెల్ 4జీ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ పడిపోయింది. 2018 డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ 4జీ సగటు డౌన్ లోడ్ స్పీడ్ 9.8 ఎంబీపీఎస్‌ కాగా, 2019 జనవరిలో 9.5ఎంబీపీఎస్‌‌కి దిగజారింది. వోడాఫోన్ కూడా తన 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ విషయంలో మెరుగుపడింది. 2018 డిసెంబర్‌లో వోడాఫోన్ సగటు 6.7 ఎంబీపీఎస్‌ ఉండగా, 2019 జనవరిలో 6.7 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఎయిర్‌టెల్ తరహాలోనే ఐడియా 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో తగ్గుదల నమోదైంది. 2018 డిసెంబర్‌లో ఐడియా 6.0 ఎంబీపీఎస్ కాగా, 2019 జనవరిలో 5.5 ఎంబీపీఎస్‌గా నమోదైంది.

Jio tops 4G download speed, Reliance Jio, Jio speed, Jio 4G, Jio Offers, Reliance Jio offers, Jio tops in 4G speed, 4G Phones, Jio news, Jio Updates, జియో 4జీ, రిలయన్స్ జియో, జియో న్యూస్, జియో ఆఫర్లు, రిలయన్స్ జియో ఆఫర్లు, జియో 4జీ స్పీడ్, ట్రాయ్, Telecom Regulatory Authority of India, Trai
ప్రతీకాత్మక చిత్రం




ఇక 4జీ అప్‌లోడ్ స్పీడ్ విషయంలో ఐడియా ముందంజలో నిలిచింది. 2019 జనవరిలో ఐడియా 4జీ అప్‌లోడ్ స్పీడ్ 5.8ఎంబీపీఎస్‌గా నమోదైంది. 2018లో ఇది 5.3 ఎంబీపీఎస్‌గా ఉంది. మరోవైపు 4జీ అప్‌లోడ్ స్పీడ్‌లో వోడాఫోన్, జియో వృద్ధిని నమోదు చేశాయి. వోడాఫోన్ 5.4ఎంబీపీఎస్, జియో 4.4 ఎంబీపీఎస్ ‌గా చార్టులో నమోదైంది. ఎయిర్‌టెల్ 4జీ అప్‌లోడ్ స్పీడ్ మాత్రం 3.8గా రికార్డయింది. 4జీ అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్ సగటున చెక్ చేస్తే జియో, ఐడియా కొన్ని నెలలుగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
First published: February 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...