మీ జియో టీవీలో ఇండియా మ్యాచ్‌లు చూడొచ్చు!

ఇకపై ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడితే టీవీకి అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, అందులో జియో టీవీ యాప్ ఉంటే చాలు.

news18-telugu
Updated: September 21, 2018, 6:02 PM IST
మీ జియో టీవీలో ఇండియా మ్యాచ్‌లు చూడొచ్చు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జియో యూజర్లకు గొప్ప శుభవార్త. ఇకపై ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్‌లన్నీ జియో టీవీలో చూడొచ్చు. ఈ మేరకు స్టార్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది రిలయెన్స్ జియో. వచ్చే ఐదేళ్లపాటు మీరు క్రికెట్ చూడాలంటే జియోటీవీ యాప్ ఉంటే చాలు. మీరు ఉన్నచోటే జియోటీవీ యాప్‌లో ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్‌లన్నీ వీక్షించొచ్చు.

సంచలనాలకు మారుపేరైన జియో... ఇప్పుడు స్టార్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరో మైలురాయి అని చెప్పుకోవచ్చు.
హై-స్పీడ్ డేటా నెట్‌వర్క్‌తో రికార్డులు సృష్టిస్తున్న జియో... ఇప్పుడు క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను యూజర్లకు అందించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. జియోటీవీ, హాట్‍స్టార్‌ యూజర్లు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు.

మొదట్నుంచీ ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్‌ని యూజర్లకు అందిస్తోంది జియో. ఇప్పుడు జియోటీవీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశంలో క్రికెట్‌ని పూజిస్తారు. అలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు నాణ్యతతో, మంచి బ్యాండ్‌విడ్త్‌తో ప్రతీ భారతీయుడికి అందుబాటులో ఉండాలి. ఈ ఒప్పందంతో జియో యూజర్లకు మంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. స్పోర్ట్స్, ఏఆర్, వీఆర్ లాంటి అనేక అంశాల్లో కస్టమర్లకు అత్యంత నాణ్యమైన సేవల్ని అందిస్తామని జియో హామీ ఇస్తోంది.
ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో
జియోటీవీ యాప్‌లో ఏఏ మ్యాచ్‌లు చూడొచ్చు?
1. టీ-202. వన్‌డే ఇంటర్నేషనల్స్(ఓడీఐ)
3. ఇంటరనేషనల్ టెస్ట్ క్రికెట్‌
4. బీసీసీఐ నిర్వహించే ప్రీమియర్ డొమెస్టిక్ కాంపిటీషన్‌ మ్యాచ్‌లు

గత ఐదేళ్లుగా భారతదేశంలో టీవీలతో పాటు డిజిటల్ మీడియా స్క్రీన్లపై క్రీడా వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా బలమైన మద్దతు ఉంది. మేం కూడా అలాంటి సరికొత్త ఆవిష్కరణల్ని అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఇతర క్రీడల విషయంలో మేం ఎలాంటి మార్పులు చేశామో, క్రికెట్ విషయంలోనూ అదే చేయబోతున్నాం. ఇప్పుడు మా సరికొత్త భాగస్వామి అయిన రిలయెన్స్ జియోతో క్రికెట్ అభిమానులకు ఉన్న అడ్డంకుల్ని తొలగించబోతున్నాం.
సంజయ్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ ఇండియా


సో... ఇకపై ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడితే టీవీకి అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, అందులో జియో టీవీ యాప్ ఉంటే చాలు. లైవ్ మ్యాచ్‌ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పేటీఎం , గూగుల్ పే మధ్య వార్

అల్జీమర్స్ అంటే ఏంటీ? రాకుండా ఏం చేయాలి?

Video: కార్డ్ పేమెంట్స్... తీసుకోవాల్సిన 30 జాగ్రత్తలు!

Video: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు పెరిగాయి!

Photos: ఈ నెలలో టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
First published: September 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు