హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Laptop: జియో సంచలనం.. చౌక ధరకే ల్యాప్‌టాప్స్? ధర, ఫీచర్లు ఇలా

Jio Laptop: జియో సంచలనం.. చౌక ధరకే ల్యాప్‌టాప్స్? ధర, ఫీచర్లు ఇలా

జియో సంచలనం.. చౌక ధరకే ల్యాప్‌టాప్స్? ధర, ఫీచర్లు ఇలా

జియో సంచలనం.. చౌక ధరకే ల్యాప్‌టాప్స్? ధర, ఫీచర్లు ఇలా

Mukesh Ambani | ముకేశ్ అంబానీ ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెెట్‌పై కన్నేశారు. అందుకే త్వరలోనే తక్కువ ధరకే ల్యాప్‌టాప్స్‌ను తీసుకురాబోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే జియో ల్యాప్‌టాప్స్ మార్కెట్‌లోకి రావొచ్చని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Jio Book | రిలయన్స్ జియో (Jio) కస్టమర్లకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. 4జీతో టెలికం రంగంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చిన జియో ఇప్పుడు ల్యాప్‌టాప్స్‌పై గురి పెట్టింది. చౌక 4జీ ఫోన్ల (Jio Phone) మాదిరిగానే తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ తీసుకురావాలని యోచిస్తోంది. వీటి ధర రూ. 15 వేలలోపే ఉండొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఈ ల్యాప్ టాప్స్‌లో 4జీ సిమ్ కార్డు ఉంటుంది. లోకాస్ట్ జియో ఫోన్ మోడల్‌నే మళ్లీ ఇప్పుడు అనుసరించాలని చూస్తోంది. తీవ్ర ధరల పోటీ కలిగిన విభాగంలో జియో మరోసారి దిగ్గజ కంపెనీలతో పోటీ పడబోతోంది.

  ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇప్పటికే గ్లోబల్ దిగ్గజ కంపెనీలైన క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియోబుక్ కోసం ఈ కంపెనీల మధ్య డీల్ కుదిరిందని చెప్పుకోవచ్చు. క్వాల్‌కామ్ సంస్థ కంప్యూటింగ్ చిప్‌ను అందిస్తుంది. ఏఆర్ఎం లిమిటెడ్ టెక్నాలజీ ప్రకారం ఇది రూపొందుతుంది. ఇక విండోస్ ఓఎస్ తయారీ కంపెనీ మాత్రం యాప్స్ సపోర్ట్ చేసేలా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తుంది.

  పండుగ సీజన్‌లో సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెలపై కీలక ప్రకటన!

  దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా కొనసాగుతూ వస్తున్న రిలయన్స్ జియోకి 42 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే ల్యాప్ టాప్స్ అంశంపై మాత్రం రిలయన్స్ జియో స్పందించలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు. జియో ల్యాప్ ట్యాప్స్ అనేవి ఈ నెల నుంచే ఎంటర్‌ప్రైస్ కస్టమర్లకు అందుబాటులో ఉండొచ్చు. అంటే స్కూల్స్, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్లకు లభించే ఛాన్స్ ఉంది. అలాగే జియో ఫోన్‌లో 5జీ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కౌంటర్ పాయింట్ ప్రకారం చూస్తే.. జియో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి 100 డాలర్ల దిగువున విభాగంలో ఇదే టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలుస్తూ వస్తోంది.

  నిర్మలా సీతారామన్ అదిరే శుభవార్త! రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్‌పై కీలక ప్రకటన!

  జియోబుక్‌ను దేశీయంగా ఫ్లెక్స్ తయారు చేయనుంది. ఇది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్. వేల సంఖ్యలో ల్యాప్ ‌టాప్స్‌ను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలుస్తోంది. పర్సనల్ కంప్యూటర్ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనొవొ వంటివి అధిక మార్కెట్‌ వాటాతో దూసుకుపోతున్నాయి. ఈ ల్యాప్ టాప్స్ జియో సొంత ఓఎస్ అయిన జియోఓఎస్‌పై పని చేస్తుంది. జియో స్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పలు ఇతర సర్వీసులు కూడా పొందొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Jio, Jio 5G, Jio phone, Mukesh Ambani, Reliance Jio

  ఉత్తమ కథలు