• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • JIO STARTS CALL OF DUTY MOBILE ACES ESPORTS CHALLENGE ON JIOGAMES PLATFORM NS

JioGames: మోబైల్ గేమర్స్ కు జియో గుడ్ న్యూస్.. రూ. 25 లక్షల ప్రైజ్ మనీతో ఈ-కాంటెస్ట్.. వివరాలివే

JioGames: మోబైల్ గేమర్స్ కు జియో గుడ్ న్యూస్.. రూ. 25 లక్షల ప్రైజ్ మనీతో ఈ-కాంటెస్ట్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మీరు మోబైల్ గేమర్సా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో డిజిటల్ కంపెనీ జియో, జియోగేమ్స్ ఎస్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ షూటింగ్ గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఎస్పోర్ట్స్ ఛాలెంజ్‌ను హోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    మొబైల్ గేమర్స్ కు ప్రముఖ టెలికాం కంపెనీ జియో గుడ్ న్యూచస్ చెప్పింది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో డిజిటల్ కంపెనీ జియో, జియోగేమ్స్ ఎస్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ షూటింగ్ గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఎస్పోర్ట్స్ ఛాలెంజ్‌ను హోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ భారత్ లో నిషేధించబడిగా పబ్ జీకి పోటీగా వస్తోంది. జియో మరియు Qualcomm CDMA Technologies Asia Pacific Pte(QCTAP) భారతదేశంలో 'కాల్ ఆఫ్ డ్యూటీ' యొక్క మొదటి ఈ-కాంటెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దీనికి ప్రైజ్ రూ. 25 లక్షలు. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఎస్పోర్ట్స్ ఛాలెంజ్ లో జియో మరియు నాన్ జియో యూజర్లు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. క్వాల్‌కామ్ ఇండియా ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వాగాడియా మాట్లాడుతూ.. మొబైల్ గేమింగ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఒకటి అని అన్నారు. భారతదేశంలో దాదాపు 90 శాతం మంది గేమర్స్ తమ మొబైల్‌ను గేమింగ్ కోసం తమ ప్రైమరీ డివైజ్ గా వాడుతున్నారన్నారు.

    సోలోగానే కాకుండా టీమ్ లు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. సోలో రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ముగియనున్నాయి. ఐదుగురు ఉండే టీమ్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 30న ముగియనున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ మరియు జియో గేమ్స్ గేమర్లకు ట్రైనింగ్ గ్రౌండ్ లాంటి ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేయడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వారు మరిన్న ప్రొపేషనల్ స్థాయి అవకాశాలను అందుకోవడానికి ఇది ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు.
    రిజిస్ట్రేషన్ లింక్: https://play.jiogames.com/esports/#/

    ఈ టోర్నమెంట్ క్వాలిఫైర్స్ జూన్ 11, 2021న జరగనుండగా.. ఫైనల్స్ జూన్ 20, 2021న జరగనున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్, పార్టిసిపేషన్ ఫీజు లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ విస్తరణ పెరుగుతున్న కొద్దీ, మొబైల్ ఇస్పోర్ట్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు స్పందించడానికి జియో యొక్క తాజా ప్రయత్నం ఇ-స్పోర్ట్స్ ఛాలెంజ్. దీని అంతిమ లక్ష్యం గేమర్స్ కోసం మరిన్ని అవకాశాలను సృష్టించడం, లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా గేమింగ్ కమ్యూనిటీలో మంచి భాగస్వామ్యం మరియు నాణ్యమైన కంటెంట్‌ను ప్రారంభించడం మరియు తదుపరి స్థాయి గేమింగ్ ప్రతిభను అంతర్జాతీయంగా పోటీ చేయడానికి మరియు గెలవడానికి వీలు కల్పించడం. భారతీయ గేమర్స్ కోసం మెరుగైన మరియు మంచి గేమింగ్ అనుభవాన్ని అందించడానికి జియో గేమ్స్ మరియు క్వాల్కమ్ టెక్నాలజీస్ కలిసి పనిచేస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published: