JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి

MY Jio App Do not Disturb Feature: మీకు ఏ ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీ డీఎన్‌డీ రిక్వెస్ట్ వెళ్తుంది.

news18-telugu
Updated: March 8, 2019, 6:50 PM IST
JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి
JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి
news18-telugu
Updated: March 8, 2019, 6:50 PM IST
మీరు ఆఫీసులో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులు ఇస్తామని, లోన్లు ఇస్తామని, ఫ్లాట్లపై ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ప్రమోషనల్ ఫోన్ కాల్స్ మీకు చికాకు తెప్పించాయా? ఇవి కాకుండా ప్రమోషనల్ ఎస్ఎంఎస్‌లతో మీ ఇన్‌బాక్స్ నిండిపోతుందా? అసలు ఇలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ ఎలా అడ్డుకోవాలో అర్థం కావట్లేదా? వీటిని అడ్డుకోవడానికే ట్రాయ్ నుంచి DND-Do not Disturb ఫీచర్ ఉంటుంది. చాలామందికి ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియదు. జియో యూజర్లు చాలా సులువుగా ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర జియో ఫోన్ ఉందా? మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారా? మరి DND-Do not Disturb ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: RRB NTPC Jobs: 35,277 పోస్టులు... దరఖాస్తు చేసుకోండి ఇలా...

My JIO యాప్‌లో DND ఎలా యాక్టివేట్ చేయాలి?



మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసినట్టైతే వైఫై డిస్ కనెక్ట్ చేసి మొబైల్ డేటా ఆన్ చేయండి. లెఫ్ట్ టాప్‌లో త్రీ లైన్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ పేజీ ఓపెన్ చేయండి. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో సర్వీస్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో Do not Disturb ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మై జియో యాప్ ఓపెన్ చేయండి మీకు డూ నాట్ డిస్టర్బ్‌కి సంబంధించిన పలు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో FULL DND సెలెక్ట్ చేసుకుంటే ఇక మీకు ఎలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు రావు. FULL DND కాకుండా బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీ డీఎన్‌డీ రిక్వెస్ట్ వెళ్తుంది. రిఫరెన్స్ నెంబర్ మెయిల్, ఎస్ఎంఎస్ వస్తాయి. వారం రోజుల్లో మీ డీఎన్‌డీ యాక్టివేషన్ పూర్తవుతుంది. Do not Disturb యాక్టివేట్ అయిన తర్వాత మీకు ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ రావు.



DND సర్వీస్‌ని అన్ని టెలికాం కంపెనీలు ఇస్తారు. అయితే జియో సబ్‌స్క్రైబర్లు My JIO యాప్‌ ద్వారా DND సర్వీస్‌ని సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
Loading...
ఇవి కూడా చదవండి:

PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు

LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు

FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ

 
First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...