జియో బంపరాఫర్...సాంసంగ్ గెలాక్సీ M సిరీస్‌తో డబుల్ డేటా ధమాకా

ఫిబ్రవరి 5 నుంచి ఈ ఆఫర్‌ను అమల్లోకి తెచ్చింది. ఐతే ఒక నెంబర్‌పై గరిష్ఠంగా 10 సార్లు మాత్రమే డబుల్ డేటా ఆఫర్ లభిస్తుంది.

news18-telugu
Updated: February 5, 2019, 8:28 PM IST
జియో బంపరాఫర్...సాంసంగ్ గెలాక్సీ M సిరీస్‌తో డబుల్ డేటా ధమాకా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జియో కస్టమర్లకు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది రిలయన్స్ జియో. సాంసంగ్‌ గెలాక్సీ M10, M20 మొబైల్స్ కొనే జియో కస్టమర్లకు డబుల్ డేటా అందించనుంది. ఐతే రూ.198, రూ.299 రిచార్జిలకు మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుంది. రూ. 198 రీచార్జితో 28 రోజులకు ప్రస్తుతం 56 జీబీ (డైలీ 2 జీబీ) డేటా లభిస్తుంది. కానీ గెలాక్సీ M10 లేదా M20 మొబైల్ కొంటే 112 జీబీ (డైలీ 4జీబీ) డేటా వస్తుంది. రూ. 299 రీచార్జితో 28 రోజులకు ప్రస్తుతం 84 జీబీ (డైలీ 3జీబీ) డేటా లభిస్తుంది. కానీ గెలాక్సీ M10 లేదా M20 మొబైల్ కొంటే 168 జీబీ (డైలీ 6జీబీ) డేటా వస్తుందన్న మాట. ఈ మేరకు సాంసంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ జియో. ఫిబ్రవరి 5 నుంచి ఈ ఆఫర్‌ను అమల్లోకి తెచ్చింది. ఐతే ఒక నెంబర్‌పై గరిష్ఠంగా 10 సార్లు మాత్రమే డబుల్ డేటా ఆఫర్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాంసంగ్... సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను వారం రోజుల క్రితం అధికారికంగా విడుదల చేసింది. 'ఇన్ఫినిటీ-వీ' పేరుతో తొలిసారిగా నాచ్ డిస్‌ప్లేతో సాంసంగ్ రూపొందించిన ఫోన్లు ఇవి. షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్ లాంటి బ్రాండ్లను టార్గెట్‌ చేస్తూ ఎం10, ఎం20 రిలీజ్ చేసింది సాంసంగ్. ఫిబ్రవరి 5 నుంచి అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభమైంది.

First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...