హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio True 5G: అసలైన 5జీ అనుభూతిని అందిస్తాం... ఇదీ జియో వాగ్దానం

Jio True 5G: అసలైన 5జీ అనుభూతిని అందిస్తాం... ఇదీ జియో వాగ్దానం

Jio True 5G: అసలైన 5జీ అనుభూతిని అందిస్తాం... ఇదీ జియో వాగ్దానం
(ప్రతీకాత్మక చిత్రం)

Jio True 5G: అసలైన 5జీ అనుభూతిని అందిస్తాం... ఇదీ జియో వాగ్దానం (ప్రతీకాత్మక చిత్రం)

Jio True 5G | ఇండియాలో జియో 5జీ నెట్వర్క్ లాంఛ్ కాబోతోంది. జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు దీపావళిలోగా ప్రారంభం కానున్నాయి. జియో ట్రూ 5జీతో అసలైన 5జీ అనుభూతిని అందిస్తామని జియో వాగ్దానం చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అక్టోబర్ 1న న్యూదిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోంది. అదే సమయంలో...వినియోగదారులకు ‘True 5G’ (అసలైన 5జీ) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు జియో సర్వసన్నద్ధంగా నిలిచింది. జియో 5జీ స్టాండ్ అలోన్ 5జీ నెట్వర్క్‌గా (5G Network) ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలో లభ్యమవుతున్న ఎన్నో నెట్వర్క్‌లు ఈ తరహావి కావు. చాలా మంది ఆపరేటర్లు నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ పైనే ఆధారపడుతున్నారు. ఈ నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనేది ప్రాథమికంగా ఇప్పటికే ఉన్న 4జీ నెట్వర్క్ నుంచే 5జీ రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేస్తుంది. ఈ విధానం వినియోగదారులకు మెరుగైన పనితీరును అందించకపోవచ్చు.

జియో 5జీ నెట్వర్క్‌ను స్టాండ్ అలోన్ నెట్వర్క్ అని అంటారు. ఎందుకంటే అది 5జీ అందించేందుకు తన 4జీ నెట్‌వర్క్‌పై ఆధారపడదు కాబట్టి. అసలైన 5జీ నెట్‌వర్క్ శక్తివంతమైన సేవలను అందిస్తుంది. లో లాటెన్సీ వద్ద చక్కటి పనితీరును అందిస్తుంది. భారీస్థాయి మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్‌కు అనువైంది. 5జీ వాయిస్‌, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ స్లైసింగ్, మెటావర్స్, ఇంకా మరెన్నింటినో అందిస్తుంది.

Online Shopping: ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎన్నో లెక్కలు వేసుకుంటూ జియో తన ‘అసలైన 5జీ’కి రూప కల్పన చేసింది. 5జీకి అవసరమైన అతిపెద్ద, అత్యంత సముచిత సమ్మేళనంగా వైర్లెస్ స్పెక్ట్రమ్‌ను పొందడంతోనే ఇది ప్రారంభమైంది. జియో సంస్థ 5జీ స్పెక్ట్రమ్‌ను 3500 MHz మిడ్ బ్యాండ్ విభాగంలో పొందింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ కోసం కేటాయించేది దీన్నే. ఇక అల్ట్రా హై కెపాసిటీ కోసం 26 GHz మిల్లీమీటర్ – వేవ్ బ్యాండ్‌ను పొందింది. అయితే, జియో 5జీ ‘అసలైన 5జీ’ నెట్‌వర్క్‌గా మారడం వెనుక 700 MHz లో-బ్యాండ్ స్పెక్ట్రమ్ పాత్ర కూడా ఉంది. ఇన్‌డోర్‌లో కవరేజ్ బాగా ఉండేందుకు ఇది అత్యంత అవసరం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో మాట్లాడుతూ, ‘‘స్టాండ్ – అలోన్ 5జీ ఆర్కిటెక్చర్, అతిపెద్ద, అత్యుత్తమ స్పెక్ట్రమ్ సమ్మేళనం, క్యారియర్ అగ్రిగేషన్...ఈ మూడింటి ప్రయోజ నమే జియో 5జీ. వీటితో ఇది కవరేజ్, కెపాసిటీ, క్వాలిటీ, అందుబాటు ధరల తిరుగులేని సమ్మేళనాన్ని అందించనుంది’’ అని అన్నారు.

jio 5g launch date, jio 5g phone, jio 5g plans, jio 5g price, jio 5g sim, Jio true 5G, jio true 5g launch date, when jio 5g will come, జియో 5జీ నెట్వర్క్, జియో 5జీ ప్లాన్స్, జియో 5జీ ఫోన్, జియో 5జీ లాంఛ్, జియో 5జీ సిమ్, జియో ట్రూ 5జీ

OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే

వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జియో 5జీ ప్రపంచపు అతిపెద్ద, అత్యంత అధునాతన 5జీ నెట్‌వర్క్ కానుందని అన్నారు. ఈ సంస్థ 5జీ తాజా వెర్షన్ అయిన స్టాండ్ అలోన్ 5జీని ఉపయోగించనుంది. అంటే, 5జీ సేవలు అందించేందుకు గాను తన 4జీ నెట్‌వర్క్‌పై ఏమాత్రం ఆధారపడదని అర్థం.

జియో ప్రత్యర్థి సంస్థలు మాత్రం నాన్-స్టాండ్ అలోన్ 5జీ వైపు చూస్తున్నాయి. అవి అలా చూడడం అంటే, 5జీని నామమాత్రంగా అందించడమే అవుతుంది.

700 MHz బ్యాండ్‌లో ఖరీదైన స్పెక్ట్రమ్‌‌ను పొందిన క్యారియర్ జియో ఒక్కటే. దీన్ని పొందేందుకు గాను ఈ ఏడాది మొదట్లో జరిగిన వేలంలో ఇది సుమారుగా రూ.40,000 కోట్లను వెచ్చించింది. వాయు తరంగాలు ఇంత భారీ మొత్తం చెల్లించే విలువ గలవని మరే ప్రత్యర్థి కంపెనీ కూడా ఆలోచించలేకపోయింది.

లో – ఫ్రీక్వెన్సీ కారణంగా 700 MHz బ్యాండ్ మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్‌ను అందిస్తుంది. అంతేగాకుండా భవనాల్లోకి సమర్థంగా చొచ్చుకుపోయే సామర్థ్యం కూడా వీటికి ఉంది. జనసాంద్రత అధికంగా ఉండే దిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఇది మెరుగైన, నిలకడతో కూడిన, వేగవంతమైన కనెక్టివిటీని అందించగలదని నిపుణులు అంటున్నారు.

భారతదేశవ్యాప్తంగా 700 MHz బ్యాండ్‌ను పొందడం ద్వారా హై ఎండ్ యూజర్లను తన నెట్‌వర్క్‌లోకి ఆకర్షించి వారికి జియో సిమ్‌ను ప్రైమరీ సిమ్‌గా చేయడాన్ని జియో తన లక్ష్యంగా చేసుకుంది. ఇళ్లు, భవనాల లోపలి భాగాల్లో మెరు గైన వాయిస్ కాల్ క్వాలిటీ, విలక్షణ 5జీ సేవలు అనేవి హై యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పియు)లకు ప్రధా న ఆకర్షణ కానున్నాయి.

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్

స్టాండ్ అలోన్ 5జీ vs నాన్ – స్టాండ్ అలోన్ 5జీ

జియో స్టాండ్ అలోన్ నెట్‌వర్క్నే ప్రధానంగా నమ్ముకుంది. దాని 700 MHz బ్యాండ్ మెరుగైన వినియోగదారు అనుభూతిని అందించనుంది. అదే జియోకు అధిక ఆదాయ మార్కెట్ వాటాను అందిస్తూ, నెట్‌వర్క్ నిర్వహణ వ్యయాలను తగ్గించనుంది. ఇది అత్యున్నత స్థాయి నాణ్యమైన అల్ట్రా – లో లాటెన్సీ 5జీ అనుభూతి ప్రయోజనాలను కూడా ఇది అందించనుంది. అంతేగాకుండా మరీ ముఖ్యంగా కీలకమైన ఎంటర్‌ప్రైజ్ విభాగానికి విస్తృత శ్రేణి అప్లికేషన్స్‌ను అందించనుంది.

ఇది కంపెనీ తన ప్రత్యర్థుల నుంచి హై-ఎండ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తోడ్పడనుంది. అది హై ఎండ్‌లో పోటీని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేగాకుండా 700 MHz బ్యాండ్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి అయ్యే వ్యయాలు కూడా తక్కువే, ఉదాహరణకు 2,100 MHz బ్యాండ్‌తో పోలిస్తే.

సబ్- GHz బ్యాండ్ - అంటే 1000 MHz కన్నా తక్కువ బ్యాండ్స్ – అనేది ఎక్కువ శక్తిని వినియోగించకుండానే వేగంతో కూడిన మెరుగైన కవరేజ్‌ను అందిస్తుంది.

జియో దీపావళి నాటికి మెట్రో నగరాలతో సహా ముఖ్యమైన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఆ తరువాత దశలవారీగా నెలవారీ విస్తరణలతో 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ ని అందుబాటులోకి తీసుకురానుంది. జియో 5జీ నిర్మాణం కోసం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ఇప్పటికే ప్రకటించింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5g technology, Jio, Jio 5G, Jio TRUE 5G, PM Narendra Modi, Reliance Jio

ఉత్తమ కథలు