జియో ప్లస్ పేరుతో జియో కొత్తగా ప్రవేశపెట్టిన పోస్ట్ పెయిడ్ ఫామిలీ ప్లాన్ (Jio Plus Postpaid Family Plan) వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఒక కుటుంబంలోని నలుగురికి కేవలం రూ. 696 లతో నెల మొత్తం మొబైల్ సేవలు అందుతాయి. ఒక వినియోగదారుడు గరిష్టంగా 4 కొత్త కనెక్షన్‌లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌తో పూర్తిగా ఉచితంగా ఉత్తమ పోస్ట్‌పెయిడ్ సేవలను పొందవచ్చు. ఈ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో మొదటి వ్యక్తికి నెలకు రూ. 399 చార్జి పడుతుంది. అదనంగా తీసుకునే ప్రతీ కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చార్జి అవుతుంది.
అంటే, మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 696 ల కనీస మొత్తం మాత్రమే చార్జ్ అవుతుంది. అంటే, ఒక్కో సభ్యుడి నెలవారీ మొబైల్ ఖర్చు రూ. 174గా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి ఒకే బిల్ వస్తుంది. అలాగే ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే, ప్లాన్ లోని కుటుంబ సభ్యులు తమ డేటాను షేర్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ ఉండదు. జియో ట్రూ 5జీ వెల్ కం ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు.
Aadhaar Update: జూన్ 14 వరకు ఆధార్ అప్‌డేట్ ఉచితం... సింపుల్‌గా ఇలా చేయండి
ఈ జియో ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్, జియోటీవీ, జియో సినిమా యాప్స్ చూడొచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, వేరే టెలీకాం సంస్థలకు చెందిన పోస్ట్ పెయిడ్ కస్టమర్లు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. వేరే నెట్ వర్క్ నుంచి సత్వరమే జియోకు మారవచ్చు.
జియో ప్లస్ కనెక్షన్ కోసం వినియోగదారులు 7000070000 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వాట్సాప్ లో పూర్తి వివరాలు అందుతాయి. సిమ్ ఫ్రీ హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు కోసం సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
ఇప్పటికే జియో ప్రీ పెయిడ్ సిమ్ వాడుతున్నవారు కూడా ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారవచ్చు. వారు తమ ఫోన్లో ఇన్ స్టాల్ అయి ఉన్న మై జియో (MyJio) యాప్ లోకి వెళ్లి ‘prepaid to postpaid’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ ట్రయల్ ప్లాన్ ను ఎంచుకోవాలి. మరిన్ని వివరాలకు www.jio.com/jioplus వెబ్ సైట్ ను సందర్శించండి.
Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చు... కానీ ఓ కండీషన్
Rs 399 Family Plan: రూ.399 ఫ్యామిలీ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. 75జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఉచితం. 3 వరకు యాడ్ ఆన్ సిమ్స్ తీసుకోవచ్చు. ఛార్జీలతో కలిపి రూ.500 చెల్లించాలి.
Rs 699 Family Plan: రూ.699 ఫ్యామిలీ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. 100జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఉచితం. 3 వరకు యాడ్ ఆన్ సిమ్స్ తీసుకోవచ్చు. ఛార్జీలతో కలిపి రూ.875 చెల్లించాలి. నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ లభిస్తుంది.
Rs 299 Individual Plan: రూ.299 ఇండివిజ్యువల్ ప్లాన్ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. 30జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఉచితం. ఛార్జీలతో కలిపి రూ.375 చెల్లించాలి.
Rs 599 Individual Plan: రూ.599 ఇండివిజ్యువల్ ప్లాన్ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఉచితం. ఛార్జీలతో కలిపి రూ.750 చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio TRUE 5G, Reliance Jio