హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: రిలయన్స్ డిజిటల్‌లో జియోఫోన్ నెక్స్ట్‌ అమ్మకాలు.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు

JioPhone Next: రిలయన్స్ డిజిటల్‌లో జియోఫోన్ నెక్స్ట్‌ అమ్మకాలు.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు

జియోఫోన్ నెక్స్ట్‌

జియోఫోన్ నెక్స్ట్‌

JioPhone Next: ఇంతకు ముందు జియో ఫోన్ నెక్స్ట్‌ను కొనాలనుకునే వారు జియోమార్ట్‌ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ (Smart Phone) కోసం నమోదు చేసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇంకా చదవండి ...

రియలన్స్ అభివృద్ధి చేసిన జియో ఫోన్ నెక్స్ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా రిలయన్స్ డిజిటల్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను.. జియో మార్ట్ (JioMart) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంచారు. అయితే దీన్ని కొనాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇంతకు ముందు జియో ఫోన్ నెక్స్ట్‌ను కొనాలనుకునే వారు జియోమార్ట్‌ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కోసం నమోదు చేసుకునేవారు. 70182-70182 నంబర్‌కు వాట్సాప్ (Whatsapp) మెసేజ్  పంపడం ద్వారా కూడా స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone) కోసం నమోదు చేసుకునే అవకాశం ఉండేది. అనంతరం అన్ని వివరాలను ధ్రువీకరించిన తర్వాత వినియోగదారులు సమీపంలోని జియోమార్ట్ డిజిటల్ స్టోర్ (Digital Store) నుంచి జియో ఫోన్ నెక్స్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిలయన్స్ డిజిటల్‌ను సందర్శించడం ద్వారా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

రిలయన్స్ డిజిటల్‌లో జియోఫోన్ నెక్స్ట్ మొబైల్ ధర రూ. 6,499గా ఉంది. కొనుగోలుదారులు డేటా బెనిఫిట్స్‌ కూడా పొందవచ్చు. నెలకు రూ. 305.93 నుంచి ప్రారంభమయ్యే EMI ఆప్షన్ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Airtel, Vi New Prices: ఎయిర్‌టెల్, వీఐ ప్రీపెయిడ్ టారిఫ్‌ల ధరలు పెంపు.. వివిధ ప్లాన్ల కొత్త ధరలివే..


రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లపై 7.5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ (Credit), డెబిట్ కార్డ్ యూజర్లు జియోఫోన్ నెక్స్ట్‌ కొనుగోలుపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు.

రిలయన్స్ డిజిటల్‌లో కాకుండా ఇతన మార్గాల్లో జియో ఫోన్‌ నెక్స్ట్‌ను కొనుగోలు చేసేవారు.. రూ. 1,999 ప్రారంభ ధర చెల్లించి దీన్ని సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని తదుపరి 18 లేదా 24 నెలల్లో సులభమైన EMI ఆప్షన్లలో చెల్లించవచ్చు.

Online Classes: ఆన్‌లైన్ క్లాస్‌లు వింటున్నారా..? గూగుల్ క్లాస్‌రూం గురించి తెలుసుకోండి


జియోఫోన్ నెక్స్ట్‌ను కొనుగోలు చేయడానికి నెలకు రూ. 600 వరకు ఖర్చు చేసే ప్లాన్‌లను సైతం ఎంచుకోవచ్చు. అదనంగా డేటా, కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

జియో ఫోన్ నెక్స్ట్ 5.45 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ QM215 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వంటి కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3,500mAh బ్యాటరీ ఉంటుంది. జియో ఫోన్‌ నెక్ట్స్‌ను గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఈ డివైజ్ కోసమే ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ (Android) ఆధారిత ప్రగతి OSతో స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది.

Published by:Sharath Chandra
First published:

Tags: Android, JioMart, JioPhone Next, Smart phone

ఉత్తమ కథలు