JIO PARTNERS WITH ONEPLUS BRINGS JIOGAMES PLATFORM TO ONEPLUS SMART TVS GH VB
Jio With OnePlus: వన్‌ప్లస్‌తో జియో ఒప్పందం.. ఇప్పుడు వన్‌ప్లస్ స్మార్ట్ టీవీల్లో అందుబాటులోకి Jio Games ప్లాట్‌ఫారమ్..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ స్మార్ట్‌టీవీ బిజినెస్‌లో వన్‌ప్లస్ సరికొత్త ఒప్పందం చేసుకొంది. మొదటిసారిగా స్మార్ట్‌టీవీల్లో గేమ్స్‌ను అందించేందుకు జియోగేమ్స్తో జతకట్టింది.
ప్రస్తుతం ఇంటర్నెట్ స్పీడ్(Speed) చాలా పెరిగింది. తక్కువ మొత్తానికే ఇంటర్నెట్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే స్మార్ట్‌టీవీల బిజినెస్(Business) ఊపందుకొంది. ఓటీటీ అప్లికేషన్లు, గేమ్ యాప్‌లు, ప్రత్యేక టీవీ షోలు అందిస్తూ స్మార్ట్‌టీవీల బిజినెస్ దూసుకుపోతోంది. తాజాగా ఇండియన్ స్మార్ట్‌టీవీ(Smart Tv) బిజినెస్‌లో వన్‌ప్లస్(One Plus) సరికొత్త ఒప్పందం చేసుకొంది. మొదటిసారిగా స్మార్ట్‌టీవీల్లో గేమ్స్‌ను అందించేందుకు జియోగేమ్స్తో జతకట్టింది. ప్రస్తుతానికి జియోగేమ్స్ లైబ్రరీలో తక్కువ గేమ్స్ అందుబాటులో ఉన్నా.. తర్వలో మరిన్ని గేమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో, వన్‌ప్లస్ పని చేస్తున్నాయి.
ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లలో జియోగేమ్స్ అందుబాటులో ఉండేవి. స్మార్ట్‌టీవీల బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు వన్‌ప్లస్‌తో జియో కలిసింది. ఈ ఒప్పందం ద్వారా వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ(OnePlus Smart Tv)లలో జియోగేమ్స్(JioGames) అందుబాటులోకి రానున్నాయి. ఇండియా స్మార్ట్‌టీవీ బిజినెస్, గేమింగ్ ఇండస్ట్రీలో ఈ తరహా ఒప్పందం మొదటిదని వన్‌ప్లస్ నిర్వాహకులు చెబుతున్నారు. సెట్‌టాప్ బాక్సుల ద్వారా జియోగేమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు కొత్తగా స్మార్ట్‌టీవీల సేవలనూ అందించేందుకు సంస్థ సిద్దమైంది. OnePlus TV U1, OnePlus TV Q, OnePlus TV Y1S సిరీస్‌లపై వన్‌ప్లస్ జియోగేమ్స్ను తీసుకురానుంది. ఈ టీవీలకంటే ముందు విడుదలైన వాటికి సాఫ్ట్వేర్(OTA) అప్టేట్ ద్వారా త్వరలో జియోగేమ్స్ను అందించే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉండే జియోగేమ్స్ ఇవే..
ప్రస్తుతానికి KGF Official Game, Alpha Guns, Jungle Adventures 3, Little Singham Treasure Hunt గేమ్స్‌ను వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలలో జియో అందిస్తోంది. జియోగేమ్స్ లైబ్రరీలోకి త్వరలో మరిన్ని గేమ్స్ వచ్చి చేరనున్నాయని జియో, వన్‌ప్లస్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. ఇండియాలో కొన్నేళ్ల క్రితమే స్మార్ట్‌టీవీల బిజినెస్‌లోకి వన్స్లస్ అడుగుపెట్టింది. Mi, Vu, Realme, Samsung కంపెనీలతో వన్‌ప్లస్ పోటీపడుతోంది. ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్లు ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫాంపై వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు పనిచేస్తున్నాయి.
చాలా ధరల్లో, ప్రత్యేక ఫీచర్లతో మార్కెట్లో వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలకు, మధ్యస్థాయిలో, ప్రీమియం వెర్షన్లలో వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలను తయారు చేస్తోంది. 32 అంగుళాల స్క్రీన్ నుంచి 65 అంగుళాల వరకు టీవీలను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజా ఇండస్ట్రీ రిపోర్టు మేరకు ఇండియా స్మార్ట్‌టీవీల బిజినెస్‌లో వన్‌ప్లస్ 7 శాతం వాటా సొంతం చేసుకుంది. ఆన్లైన్ సేవలు, ఓటీటీ ప్లాట్‌ఫాం, స్మార్ట్‌టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌తో కొత్త మార్గాలను కంపెనీలు అన్వేషిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఆన్లైన్ గేములను సైతం అందిస్తున్నాయి. పెద్ద స్క్రీన్లు, ఎక్కువ సినిమాలు, గేములు, సులువుగా ఉపయోగించడం వంటి కారణాలతో స్మార్ట్ టీవీలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.