Jio-OnePlus 7: వన్‌ప్లస్ 7 ఫోన్ కొంటే జియో నుంచి రూ.9,300 బెనిఫిట్స్... వివరాలివే

Jio-OnePlus 7 Series Beyond Speed Offer | వన్‌ప్లస్ 7 లేదా వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్నవారు 'జియో-వన్‌ప్లస్ 7 సిరీస్ బియాండ్ స్పీడ్ ఆఫర్' పొందొచ్చు. ఈ ఆఫర్‌‌లో భాగంగా రూ.9,300 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు.

news18-telugu
Updated: May 14, 2019, 3:59 PM IST
Jio-OnePlus 7: వన్‌ప్లస్ 7 ఫోన్ కొంటే జియో నుంచి రూ.9,300 బెనిఫిట్స్... వివరాలివే
Jio-OnePlus 7: వన్‌ప్లస్ 7 ఫోన్ కొంటే జియో నుంచి రూ.9,300 బెనిఫిట్స్... వివరాలివే (Image: WinFuture)
news18-telugu
Updated: May 14, 2019, 3:59 PM IST
వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. లండన్, న్యూయార్క్, బెంగళూరులో ఒకేసారి కొత్త సిరీస్ రిలీజ్ చేయనుంది వన్‌ప్లస్. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గంటలకు బెంగళూరులో ఈవెంట్ జరగనుంది. వన్‌ప్లస్ యూకే వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ చూడొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లు కొనేవారికి రిలయెన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. 'జియో-వన్‌ప్లస్ 7 సిరీస్ బియాండ్ స్పీడ్ ఆఫర్' పేరుతో రూ.9,300 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు.

Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Jio-OnePlus 7 Series Beyond Speed Offer: జియో వన్‌ప్లస్ 7 సిరీస్ ఆఫర్లు ఇవే...



వన్‌ప్లస్ 7 లేదా వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్నవారు 'జియో-వన్‌ప్లస్ 7 సిరీస్ బియాండ్ స్పీడ్ ఆఫర్' పొందొచ్చు. ఈ ఆఫర్‌‌లో భాగంగా రూ.9,300 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు. ఇందులో రూ.5,400 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందుకోసం రూ.299 రీఛార్జ్ చేసుకోవాలి. jio.com, రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్, మైజియో స్టోర్స్, జియో రీటైలర్స్, మైజియో యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత రూ.150 విలువైన 36 ఓచర్లు లభిస్తాయి. ఈ ఓచర్లు మైజియో యాప్‌లో చూడొచ్చు. వాటిని రీఛార్జ్‌లపై రీడీమ్ చేసుకోవచ్చు. ఇక రూ.3,900 విలువైన బెనిఫిట్స్ పార్ట్‌నర్స్ నుంచి వస్తాయి. అందులో Zoomcar నుంచి రూ.2,000 లేదా 20 శాతం డిస్కౌంట్(ఏది తక్కువైతే అది), EaseMyTrip నుంచి ఫ్లైట్, హోటల్ బుకింగ్‌పై రూ.1,550 తగ్గింపు, బస్ బుకింగ్స్‌పై 15 శాతం తగ్గింపు లభిస్తుంది. Chumbak నుంచి రూ.1,699 బిల్లింగ్‌పై రూ.350 డిస్కౌంట్ లభిస్తుంది.



Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే
Loading...
ఇవి కూడా చదవండి:

LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

 
First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...