JIONEWS APP: జియోన్యూస్ యాప్ రిలీజ్ చేసిన రిలయెన్స్ జియో

JIONEWS APP | జియో న్యూస్ యాప్ సేవలు 12 భాషల్లో లభిస్తాయి. జియో యూజర్లు అన్ని ఫీచర్లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

news18-telugu
Updated: April 11, 2019, 6:39 PM IST
JIONEWS APP: జియోన్యూస్ యాప్ రిలీజ్ చేసిన రిలయెన్స్ జియో
JIONEWS APP: జియోన్యూస్ యాప్ రిలీజ్ చేసిన రిలయెన్స్ జియో
news18-telugu
Updated: April 11, 2019, 6:39 PM IST
జియోన్యూస్ యాప్‌ను రిలీజ్ చేసింది రిలయెన్స్ జియో. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ వాడుకోవచ్చు. వివిధ వార్తాసంస్థల నుంచి సంగ్రహించిన వార్తల్ని ఒకేచోట అందించడం జియోన్యూస్ యాప్ ప్రత్యేకత. అంతేకాదు స్థానిక, విదేశీ మ్యాగజైన్లు, బ్లాగులు సైతం ఈ యాప్‌లో యాక్సెస్ చేయొచ్చు. 150+ లైవ్ న్యూస్ ఛానెల్స్, 800+ మ్యాగజైన్స్, 250+ న్యూస్ పేపర్స్ ఒకే యాప్‌లో చూడొచ్చు. యూజర్లు హోమ్‌పేజీని తమ ఆసక్తి, అభిరుచికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్, నేషనల్, సినిమా, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, బిజినెస్, స్పోర్ట్స్... ఇలా వేర్వేరు కేటగిరీల వార్తల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు.

Read this: Amazon Fab Phone Fest: అమెజాన్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

జియో న్యూస్ యాప్ సేవలు 12 భాషల్లో లభిస్తాయి. జియో యూజర్లు అన్ని ఫీచర్లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. నాన్-జియో యూజర్లు ఫేస్‌బుక్ లేదా గూగుల్ ఐడీ ద్వారా సైన్ ఇన్ చేసి 90 రోజుల పాటు ఉచితంగా సేవలు ఉపయోగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లు జియోన్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.



ఐఓఎస్ యూజర్లు జియోన్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి:
Loading...
 

Flipkart Super Cooling Days: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై 65% వరకు తగ్గింపు

Zomato: జొమాటోలో ఒక్క రెస్టారెంట్‌కే రోజూ 2,000 బిర్యానీ ఆర్డర్స్

SBI Card: ఈ 12 గోల్డెన్ రూల్స్‌తో మీ ఎస్‌బీఐ కార్డ్ సేఫ్‌
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...