JIONEWS APP LAUNCH : సమస్త వార్తా ప్రపంచం జియో న్యూస్ ప్రారంభం...12 భాషల్లో సేవలు లభ్యం...

జియోన్యూస్ మొత్తం 12 భాషల్లో అందుబాటులోకి రాగా,ప్రతీ క్షణం బ్రేకింగ్ న్యూస్ లతో పాటు, 150కు పైగా లైవ్ చానెల్స్, 800కు పైగా మ్యాగజైన్స్, 250కు పైగా న్యూస్ పేపర్స్, ఇతర ఫేమస్ బ్లాగ్స్, దేశంలోని పేరెన్నికగన్నా వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఒకే యాప్ ద్వారా లభ్యం కానున్నాయి.

news18-telugu
Updated: April 11, 2019, 10:29 PM IST
JIONEWS APP LAUNCH : సమస్త వార్తా ప్రపంచం జియో న్యూస్ ప్రారంభం...12 భాషల్లో సేవలు లభ్యం...
JIONEWS APP: జియోన్యూస్ యాప్ రిలీజ్ చేసిన రిలయెన్స్ జియో
  • Share this:
రిలయన్స్ జియో మరో అద్భుతమైన వార్తా ప్రపంచం ఆవిష్కరించింది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ గా పేరొందిన రిలయన్స్ జియో నుంచి జియో న్యూస్ యాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, అలాగే యాపిల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఐపీఎల్, క్రికెట్ వరల్డ్ కప్ లాంటి అతిపెద్ద ఈవెంట్స్ అప్‌డేట్స్ కోసం ప్రజలంతా ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర వార్తా వేదికలకు భిన్నంగా వన్ స్టాప్ సొల్యూషన్‌గా జియో న్యూస్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోస్, మాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఇలా ఎన్నో సౌకర్యాలు జియో న్యూస్ లో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా యూత్ అభిరుచికి తగ్గట్టు జియో న్యూస్ యాప్ రూపొందించడం జరిగింది.

జియోన్యూస్ మొత్తం 12 భాషల్లో అందుబాటులోకి రాగా, ఇందులో పూర్తిగా పర్సనలైజ్డ్ చాయిస్ బేస్డ్ గా యాప్ ను డిజైన్ చేశారు. అలాగే ప్రతీ క్షణం బ్రేకింగ్ న్యూస్ లతో పాటు, 150కు పైగా లైవ్ చానెల్స్, 800కు పైగా మ్యాగజైన్స్, 250కు పైగా న్యూస్ పేపర్స్, ఇతర ఫేమస్ బ్లాగ్స్, దేశంలోని పేరెన్నికగన్నా వెబ్‌సైట్స్ అన్నీ కూడా జియో న్యూస్ యాప్  ద్వారా లభ్యం కానున్నాయి. అంతే కాదు ట్రెండింగ్ వీడియోస్, బాలివుడ్, ఫ్యాషన్, హెల్త్, ఆటోమోటివ్, టెక్నాలజీ, స్పోర్ట్స్, ఇలా ప్రతీ విభాగానికి సంబంధించిన సమాచారం ఒకే వేదికగా జియో న్యూస్ అందించనుంది.

అంతే కాదు దాదాపు 800 కు పైగా మ్యాగజైన్స్ వివిధ భాషల్లో జియోన్యూస్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ప్రతీ ఉదయం దేశంలోని అన్ని లీడింగ్ వార్తా పత్రికల తాజా వార్తాలను తెల్లవారగానే జియో న్యూస్ ద్వారా మిమ్మల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏఐ, ఎంఎల్ టెక్నాలజీతో జియో న్యూస్ మీ చాయిస్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తుంది. మరో ముఖ్యమైన విషయం జియో యూజర్స్ అందిరికీ ప్రీమియం యాక్సెస్ సర్వీసులు అందిస్తుండగా, నాన్ జియో యూజర్స్ ట్రయల్ పీరియడ్ లో భాగంగా అన్ని సర్వీసులు పొందేందుకు వీలు కల్పించడం విశేషం.

మీవార్తలు...మీ భాషలోనే అనే నినాదంతో ముందుకు వచ్చిన జియో న్యూస్ ప్రజలకు ఒక సమగ్రమైన వార్తా వేదికగా అవతరించింది.



ఏపీ ఇంటర్ రిజల్ట్స్ కోసం :
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు