JIO Network : జియో దూకుడు.. డౌన్‌లోడ్ చేయడంలో ఫస్ట్..

ఫ్రీ సిమ్, ఫ్రీ డాటాతో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్ కస్టమర్లకి సరికొత్త సౌలభ్యాలు కల్పిస్తూ నెంబర్ 1 దిశగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో డౌన్‌లోడ్ చేసే విషయంలో నెట్‌వర్క్ అన్నింటిలోకెల్లా జియో ముందువరుసలో నిల్చుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 16, 2019, 4:04 PM IST
JIO Network : జియో దూకుడు.. డౌన్‌లోడ్ చేయడంలో ఫస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 16, 2019, 4:04 PM IST
రిలయన్స్ జియో ఫిబ్రవరిలో ఫుల్ ఫాస్ట్ టెలికామ్‌గా నిలిచింది. సగటు డౌన్‌లోడ్ వేగం సెకనుకు 20.9 ఎమ్‌బీ నమోదైంది. జనవరి గణంకాలను పరిశీలించిన ట్రాయ్.. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ వరుసగా 9.4, 6.7 ఎమ్‌బీపీఎస్ వేగాన్ని నమోదు చేసుకున్నాయని టెలికాం నియంత్రణాధికార సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరిలో 5.5 ఎమ్‌బీపీఎస్ వేగం ఉండగా.. ఫిబ్రవరిలో 5.7కి చేరింది. ఇందులో వొడాఫోన్ ఐడియా విలీనం అయినప్పటికీ ట్రాయ్ విడివిడిగానే పనితీరును వెల్లడించింది.
అదే అప్‌లోడ్ విషయంలో మాత్రం వొడాఫోన్ ముందువరుసలో ఉంది. జనవరిలో 5.4mbps ఉండగా ఫిబ్రవరిలో వేగాన్ని నమోదు చేసింది. ఇక ఐడియా, ఎయిర్‌టెల్‌లు జనవరిలో వరుసగా 5.6, 3.7 ఎంబీపీఎస్‌గా ఉన్నాయి. జియో 4. 5 ఎమ్‌బీపీఎస్ సగటు అప్‌లోడ్ స్పీడ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే మరికొన్ని మార్పులు చేసి నెట్‌వర్క్ ప్రపంచంలోనే సరికొత్త రికార్డు సృష్టించేందుకు జియో ప్రయత్నాలు చేస్తోంది.

First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...