జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

జియోసావన్‌లో మొత్తం 4.5 కోట్ల పాటలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న ఒరిజినల్ కంటెంట్ ఉంది. జియోసావన్ యాప్ సైజ్ 79 ఎంబీ. అన్ని ఐఓఎస్ డివైజుల్లో ఐఓఎస్ 8.0 కన్నా ఎక్కువ ఉంటే ఈ యాప్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: December 4, 2018, 6:11 PM IST
జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ
జియోసావన్ యాప్ స్క్రీన్ షాట్స్
  • Share this:
ప్రముఖ మ్యూజిక్ యాప్ సావన్‌ను రిలయెన్స్ జియో సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలోనే ఆకాశ్ అంబానీ నేతృత్వంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు సావన్ కాస్తా 'జియోసావన్‌'గా మారింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీగా సావన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఏర్పడింది. యాపిల్ యాప్‌స్టోర్‌లో సావన్ యాప్ జియోసావన్‌గా కనిపిస్తోంది. సావన్ మ్యూజిక్ లైబ్రెరీ, ప్లేలిస్ట్, డిజైన్ లాంటివేమీ మారలేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్ మారాల్సి ఉంది. త్వరలో అన్ని యాప్‌స్టోర్స్‌లో జియోసావన్ యాప్ కనిపిస్తుంది. జియో యాప్ స్టోర్, జియో ఫోన్, www.jio.com/jiosaavnలో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ సేవల్ని అందిపుచ్చుకోవడం, ప్రపంచంతో పోలిస్తే డిజిటల్ మ్యూజిక్ ఇండస్ట్రీ సమానంగా విస్తరిస్తుండటం, సాంకేతిక ఆవిష్కరణలు వేగవంతమవడం లాంటివి భారతదేశం చూస్తున్న తరుణంలో మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో జియో సావన్ ఓ మలుపు. జియోకు చెందిన అడ్వాన్స్‌డ్ డిజిటల్ సేవల వ్యవస్థ, దేశమంతా యూజర్లు ఉండటంతో జియోసావన్ భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారుతుంది.
ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, రిలయెన్స్ జియో


సావన్‌ నిర్వహించే #NoFilterNeha, థ్యాంక్యూ ఫర్ షేరింగ్, టేక్ 2 విత్ అనుపమ అండ్ రాజీవ్, టాకింగ్ మ్యూజిక్, కహానీ ఎక్స్‌ప్రెస్ విత్ నీలేష్ మిశ్రా లాంటి కార్యక్రమాలన్నింటినీ జియోసావన్ కొనసాగించనుంది. సావన్ సహ-వ్యవస్థాపకులైన రిషీ మల్హోత్రా, పరందీప్ సింగ్, వినోద్ భట్ వారివారి పదవుల్లోనే ఉంటూ కంపెనీని ముందుకు నడిపించనున్నారు. జియో సావన్‌ బృందంలో 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని మౌంట్ వ్యూ, న్యూయార్క్‌తో పాటు భారతదేశంలోని బెంగళూరు, గురుగ్రామ్, ముంబైలో గ్లోబల్ ఆఫీసులున్నాయి.మార్చి 2018లోనే మా విలీనాన్ని ప్రకటించాం. ఇన్నాళ్లు జియో, సావన్ బృందాలు కలిసి కంబైన్డ్ ప్లాట్‌ఫామ్ రూపొందించాయి. ప్రపంచంలోనే సమర్థవంతమైన, పర్సనలైజ్డ్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా ఆవిర్భవించింది. కళాకారులు, క్రియేటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌తో నేరుగా కాంటాక్ట్ అయ్యే కార్యక్రమాలు రూపొందించడం మా ప్రత్యేకత.
రిషీ మల్హోత్రా, కో-ఫౌండర్ అండ్ సీఈఓ, జియోసావన్


జియోసావన్‌లో మొత్తం 4.5 కోట్ల పాటలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న ఒరిజినల్ కంటెంట్ ఉంది. జియోసావన్ యాప్ సైజ్ 79 ఎంబీ. అన్ని ఐఓఎస్ డివైజుల్లో ఐఓఎస్ 8.0 కన్నా ఎక్కువ ఉంటే ఈ యాప్ వాడుకోవచ్చు. జియో మ్యూజిక్ యూజర్లు కూడా జియోసావన్ యాప్ ఉపయోగించుకోవచ్చు. రిలయెన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ఉన్నవాళ్లు సావన్ ప్రోను 90-రోజుల ఫ్రీ ట్రయల్ ఉపయోగించుకోవచ్చు.ఇవి కూడా చదవండి:

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

ఫిక్స్‌డ్ డిపాజిట్స్: ఏ బ్యాంక్ మంచిది?
First published: December 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు