• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • JIO LAUNCHES HD VIDEO CONFERENCING APP JIOMEET CAN HOST UP TO 100 USERS BA

JioMeet హెచ్‌డీ వీడియో కాలింగ్ యాప్.. 100 మందితో ఒకేసారి లైవ్ మాట్లాడొచ్చు..

JioMeet హెచ్‌డీ వీడియో కాలింగ్ యాప్.. 100 మందితో ఒకేసారి లైవ్ మాట్లాడొచ్చు..

JioMeet APP | జియో మీట్ యాప్ (ప్రతీకాత్మక చిత్రం)

JioMeet పేరుతో హెచ్‌డీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను జియో ప్రవేశపెట్టింది.

  • Share this:
    JioMeet | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ప్లాట్ ఫాం నుంచి మరో కొత్త ఫీచర్ ఆవిష్కృతమైంది. JioMeet పేరుతో హెచ్‌డీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను జియో ప్రవేశపెట్టింది. ఇందులో సుమారు 100 మంది యూజర్లు ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అత్యంత సులభంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే, వర్క్ ఫోర్స్‌కు ఇది బాగా ఉపయోగపడనుంది. గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ ద్వారా కూడా ఈ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో జాయిన్ కావొచ్చు. ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ఇది ఫ్రీ. ఎలాంటి రుసుము లేకుండా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    JioMeet APP | జియో మీట్ యాప్ (ప్రతీకాత్మక చిత్రం)


    మీ కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఎవరితో అయినా మాట్లాడి అత్యద్భుతమైన వీడియో కాలింగ్ అనుభూతిని పొందవచ్చని జియో ప్రకటించింది.
    First published:

    అగ్ర కథనాలు