Jio First Day First Show: సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు

Jio First Day First Show | జియో గిగాఫైబర్ ప్రీమియం కస్టమర్లు... ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా మీరు ఇంట్లోనే చూడొచ్చు. అయితే కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.

news18-telugu
Updated: August 12, 2019, 12:56 PM IST
Jio First Day First Show: సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు
Jio First Day First Show: సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు
news18-telugu
Updated: August 12, 2019, 12:56 PM IST
కొత్త సినిమా రిలీజ్ కాగానే థియేటర్‌కు వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం మీకు అలవాటా? ఇకపై మీరు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడొచ్చు. ఈ కల నెరవేరుస్తోంది రిలయెన్స్ జియో. సంచలనాలకు మారుపేరైన రిలయెన్స్ జియో... 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనేక కొత్త సర్వీసులతో పాటు 'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో' పేరుతో ఓ ప్లాన్ ప్రకటించింది. జియో గిగాఫైబర్ ప్రీమియం కస్టమర్లు... ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా మీరు ఇంట్లోనే చూడొచ్చు. అయితే కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ సేవలు ప్రారంభమౌతాయని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముకేష్ అంబానీ తెలిపారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా రిలీజైన 40 రోజుల తర్వాత లిస్ట్ అవుతోంది. వీటికి 'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో' సర్వీస్ సవాల్ విసరనుంది.

సినిమా రిలీజ్ రోజే ఇంట్లో చూసే అవకాశం మాత్రమే కాదు... మరిన్ని అద్భుతమైన సేవల్ని ప్రకటించింది రిలయెన్స్ జియో. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' తీసుకునేవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందించబోతోంది. ఇక 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ఉండే గిగాఫైబర్ ప్లాన్స్ ధరలు రూ.700 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయి. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌తో సాధ్యం.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు




ఇవి కూడా చదవండి:

JIO Gigafiber: జియో గిగాఫైబర్ సేవలపై రిలయెన్స్ క్లారిటీ... ప్రత్యేకతలు ఇవే

JIO GigaFiber: జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం
Loading...
WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...