Home /News /technology /

JIO FIBER REITERATES COMMITMENT TO PROVIDE SEAMLESS HIGH SPEED BROADBAND CONNECTIVITY IN TELANGANA BA

JioFiber | లాక్‌డౌన్‌లో కూడా తెలంగాణలో జియో ఫైబర్ హైస్పీడ్ సేవలు...

జియో ఫైబర్

జియో ఫైబర్

జియో ఫైబర్ కస్టమర్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రిలయన్స్ జియో ఫైబర్ ఫ్రంట్ లైన్ యోధులు తెలంగాణలో నిరంతరం శ్రమిస్తున్నారు.

    క్లిష్ట పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్న జియో ఫైబర్ తెలంగాణలో తమ కస్టమర్ల‌కు బెస్ట్ సర్వీస్‌ను అందించేందుకు నిరంతరం శ్రమిస్తోంది. హైదరాబాద్‌‌తోపాటు తెలంగాణలో కొన్ని ముఖ్య పట్టణాల్లో జియోఫైబర్ తమ సేవలను అందిస్తోంది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో చాలా మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. అలాంటి వారి కోసం జియో ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కృషి చేస్తోంది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను 1 జీబీపీఎస్ వేగంతో అందిస్తోంది. డేటా వినియోగం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జియో వినియోగదారుల కోసం అన్ని ప్లాన్ల మీద డబుల్ డేటాను అందిస్తోంది.

    Jio Offer అందిస్తున్న ప్యాకేజీలు


    లాక్ డౌన్ నెలకొన్న వేళ కూడా సమర్థంగా ఇన్‌స్టాలేషన్, సర్వీసులను అందించేందుకు జియో ఫైబర్ టీమ్ శ్రమిస్తోంది. దీంతో చాలా మంది జియో ఫైబర్ వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ జియోఫైబర్ సేవల గురించి పలు సామాజిక మాధ్యమాల్లో అభినందిస్తున్నారు. ప్రస్తుతం జియో ఫైబర్ హైస్పీడ్ హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ కోదాడ, మహబూబ్ నగర్, నల్లగొండల్లో లభ్యమవుతోంది. అదే వేగంతో ఇతర పట్టణాలకు కూడా జియోఫైబర్ విస్తరిస్తోంది. 100 ఎంబీపీఎస్‌తో మొదలు కొని 1జీబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను జియో ఫైబర్ అందిస్తోంది. దీని వల్ల వ్యక్తులు, చిన్న , పెద్ద సంస్థలు కూడా లబ్ధి పొందుతున్నాయి.

    జియో ఫైబర్ కస్టమర్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రిలయన్స్ జియో ఫైబర్ ఫ్రంట్ లైన్ యోధులు తెలంగాణలో నిరంతరం శ్రమిస్తున్నారు. ‘StayConnected, StayProductive’ ఆఫర్ కింద కస్టమర్లకు జియో ఫైబర్ డబుల్ డేటా అందిస్తోంది. కొత్త వినియోగదారులకు ఉచిత కనెక్టివిటీతో 10 ఎంబీపీఎస్ వేగం, 100 జీబీ డేటాను అందిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jio fiber, Reliance Jio, Telangana, Work From Home

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు