Jio Effect: బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

BSNL Free Amazon Prime Subscription | అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందినవాళ్లు ప్రైమ్ వీడియో సేవలతో పాటు అమెజాన్ ప్రైమ్ షాపింగ్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లాంటి సేవల్ని పొందొచ్చు.

news18-telugu
Updated: August 27, 2019, 4:46 PM IST
Jio Effect: బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
Jio Effect: బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
  • Share this:
వచ్చే నెలలో అధికారికంగా రిలీజ్ కాబోతున్న జియో ఫైబర్... టెలికామ్ కంపెనీల్లో దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL కంపెనీపైనా జియో ఫైబర్ ఎఫెక్ట్ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యాన్యువల్ ప్లాన్స్ ఎంచుకునేవారికి రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.399 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్ తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందినవాళ్లు ప్రైమ్ వీడియో సేవలతో పాటు అమెజాన్ ప్రైమ్ షాపింగ్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లాంటి సేవల్ని పొందొచ్చు. ఈ ఆఫర్ అన్ని సర్కిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... కొన్ని యాన్యువల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై 25 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది బీఎస్ఎన్ఎల్.

ఒక్క బీఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు... జియో ఫైబర్ దెబ్బకు ఇతర కంపెనీలు కూడా విలవిలలాడుతున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లు అందించే కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ కొత్త, పాత కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై బెనిఫిట్స్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్ ప్రారంభ ధర నెలకు రూ.799. అందులో 40 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 100 జీబీ మాత్రమే ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అందులో ల్యాండ్‌లైన్ టెలిఫోన్ అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఆరు నెలలకు 200 జీబీ బోనస్ డేటా కూడా ప్రకటించింది ఎయిర్‌టెల్.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Traffic Fines: సెప్టెంబర్ 1 నుంచి మారే ట్రాఫిక్ ఫైన్స్ ఇవే...

Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...ATM: డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి
First published: August 27, 2019, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading