టెలికాం దిగ్గజం జియో 5Gని (Jio 5G) ప్రారంభించడంలో దేశంలో సంచలనం సృష్టిస్తోంది. తమళనాడులోని (Tamil nadu) కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, సాలెం, హోసూర్, వెల్లూరులో తాజాగా 5G సేలవను ప్రారంభించింది. దీంతో జియో ట్రూ 5G సేవలు దేశంలోని 100 సిటీలకు చేరాయి. తమిళనాడు ఐటీ, డిజిటల్ సేవల మంత్రి టీ.మనో తంగరాజ్ కోయంబత్తూర్ లో ఈ సేవలను ఈ రోజు ప్రారంభించారు. తమిళనాడులో జియో 5జీ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సేవలు తమిళనాడు ప్రజల జీవితాల్లో మార్పులు తేస్తాయని ఆకాంక్షించారు. జియో ప్రతినిధి మాట్లాడుతూ.. తమిళనాడులో ఆరు సిటీలకు జియో ట్రూ 5జీ సేవలను విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తమిళనాడులోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తమిళనాడు రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, టౌన్ లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. జియో 5జీ సేవల రాకతో తమిళనాడులో కేవలం టెలికాం రంగంలోనే కాకుండా.. ఈ-గవర్నెన్స్, ఎడ్యుకేషన్ , హెల్త్ కేర్, ఐటీ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. తమళనాడులోకి జియో సేవలను తీసుకురావడం కోసం జియో రూ.40 వేల కోట్లను పెట్టుబడి పెడుతోందన్నారు.
తద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తమిళనాడుపై తమకు ఉన్న కమిట్మెంట్ కు ఇది నిదర్శనమన్నారు. తమిళనాడలోని ప్రతీ ప్రాంతానాకి 5జీ సేవలను తీసుకురావడం కోసం తమ ఇంజనీర్లు రేయిబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. తమకు సహకరించిన ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వానికి జియో ప్రతినిధి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio 5G, Jio TRUE 5G, Reliance Jio, Tamil nadu