Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్

Airtel Prepaid Plans | రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 3 జీబీ డేటా లభిస్తుంది. రూ.98 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 10 జీబీ డేటా లభిస్తుంది.

news18-telugu
Updated: April 30, 2019, 6:33 PM IST
Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్
Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్
  • Share this:
జియో దెబ్బతో ఇతర టెలికామ్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్స్‌ను సవరించుకుంటున్నాయి. రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ కొత్తగా రూ.48, రూ.98 రీఛార్జ్ ప్లాన్స్‌ని రూపొందించడం విశేషం. రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 3 జీబీ డేటా లభిస్తుంది. రూ.98 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 10 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 10 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ప్లాన్స్‌తో వాయిస్ కాల్ బెనిఫిట్స్ రావు. టెలికామ్ కంపెనీల మధ్య డేటా వార్ నడుస్తోంది. దీంతో అన్ని కంపెనీలు పోటాపోటీగా ప్లాన్స్ రూపొందిస్తున్నాయి.

Read this: WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

ఈ ఏడాది ప్రారంభంలో వొడాఫోన్ రూ.119 ప్లాన్ ప్రారంభించింది. రూ.119 రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం వొడాఫోన్ రూ.139 ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ డేటా లభిస్తుంది. ఇక వొడాఫోన్‌కు చెందిన రూ.159 ప్లాన్‌లో 28 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు నెల రోజులకు లభిస్తాయి. గతవారం బీఎస్ఎన్ఎల్ రూ.35, రూ.53, రూ.395 రీఛార్జ్‌ప్లాన్స్ రూపొందించింది. ఈ ప్లాన్స్‌తో 5జీబీ, 8జీబీ, 2జీబీ డేటా లభిస్తాయి.

Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్



ఇవి కూడా చదవండి:

Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా
Loading...
PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం

WhatsApp: వాట్సప్‌ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...