జియో దివాళీ ధమాకా ఆఫర్: భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్

దివాళీ ధమాకాలో మరిన్ని ఆఫర్లున్నాయి. పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, మొబిక్విక్‌ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ. 300 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో సబ్‌స్క్రైబర్స్ కోసం ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ప్రకటించింది. రూ.1,699 చెల్లిస్తే 547 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఏడాది వరకు లభిస్తాయి. ఈ ప్లాన్‌పై 100% క్యాష్‌బ్యాక్ ఇవ్వడం మరో విశేషం. దాంతోపాటు రూ.4,999 నుంచి రూ.9,999 మధ్య రెండేళ్ల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

news18-telugu
Updated: November 6, 2018, 4:01 PM IST
జియో దివాళీ ధమాకా ఆఫర్: భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్
జియో దివాళీ ధమాకా ఆఫర్
  • Share this:
దీపావళి సందర్బంగా రిలయెన్స్ జియో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్నాళ్లూ ఫ్లాష్‌సేల్‌లోనే అందుబాటులో ఉన్న జియోఫోన్ 2 ఓపెన్ సేల్‌ ద్వారా కొనొచ్చు. జియో నుంచి వచ్చిన హై-ఎండ్ మోడల్ ఫోన్‌ ఇది. ఈ ఫోన్ అసలు ధర రూ.రూ.2,999. దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.200 పేటీఎం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్వర్టీ కీప్యాడ్, వెడల్పు డిస్‌ప్లే, 4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌తో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ యాప్స్‌ని సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత.

జియో ఫోన్ 2 ఎలా కొనాలి?

రిలయెన్స్ అఫిషియల్ వెబ్‌సైట్ jio.com లేదా మైజియో యాప్‌లోకి వెళ్లాలి. జియో ఫోన్ 2 సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు చెక్ ఔట్ బటన్ క్లిక్ చేయాలి. పేరు, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రూ.2999 చెల్లించాలి. రూ.200 పేటీఎం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్‌కు కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 12 వరకు ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉంటుంది ఈ ఫోన్.

జియో దివాళీ ధమాకా ఆఫర్: భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, Jio Diwali Dhamaka offer: JioPhone 2 Paytm Offer, Free JioFi, 100 Percent Cashback And More
జియోఫోన్ 2


జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్
డిస్‌‌ప్లే: 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
ర్యామ్: 512 ర్యామ్ఇంటర్నల్ స్టోరేజ్: 4జీబీ
రియర్ కెమెరా: 2 మెగా పిక్సెల్
ఫ్రంట్ కెమెరా: వీజీఏ
బ్యాటరీ: 2000 ఎంఏహెచ్
ఓఎస్: కేఏఐఓఎస్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.2,999

దాంతోపాటు దివాళీ ధమాకాలో మరిన్ని ఆఫర్లున్నాయి. పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, మొబిక్విక్‌ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ. 300 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో సబ్‌స్క్రైబర్స్ కోసం ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ప్రకటించింది. రూ.1,699 చెల్లిస్తే 547 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఏడాది వరకు లభిస్తాయి. ఈ ప్లాన్‌పై 100% క్యాష్‌బ్యాక్ ఇవ్వడం మరో విశేషం. దాంతోపాటు రూ.4,999 నుంచి రూ.9,999 మధ్య రెండేళ్ల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. కానీ దీంట్లో రోజువారీగా డేటా లిమిట్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు.

ఇక రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్‌లో ల్యాప్‌టాప్ కొన్నవారికి రూ.3000 విలువైన డేటా బెన్‌‌ఫిట్ ఉంటుంది. ఇందులో ఫ్రీ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా(386జీబీ), జియో ప్రైమ్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఎల్‌జీ స్మార్ట్ టీవీ కొన్నవాళ్లకు జియోఫైతో పాటు రూ.2000 విలువైన డేటా బెన్‌ఫిట్స్ వస్తాయి.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో ఈ రూల్స్ మారాయి తెలుసా?

దీపావళి స్పెషల్: రూ.20,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో తెలుసా?

ధన్‌తేరస్ ఎందుకు జరుపుకొంటారో తెలుసా?
First published: November 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading