Home /News /technology /

JIO BP TO POWER NEXUS MALLS EV JOURNEY TO SETUP CHARGING STATIONS AND BATTERY SWAPPING STATIONS UMG GH

EV Charging Stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఓనర్స్‌కి ఫుల్ ఛార్జ్ న్యూస్.. 13 నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు.. జియో-బీపీ కీలక నిర్ణయం

13 నగరాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు.

13 నగరాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) & బీపీ (BP) సంయుక్త సంస్థ అయిన జియో-బీపీ (Jio-BP) ఇండియాలో అధునాతన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దేశీయ అతిపెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్ అయిన నెక్సస్ మాల్స్‌ (Nexus Malls)తో పార్ట్‌నర్‌షిప్ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
ఇండియాలోని ప్రముఖ నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు (EV Charging Stations) క్రమక్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) & బీపీ (BP) సంయుక్త సంస్థ అయిన జియో-బీపీ (Jio-BP) కూడా ఇండియాలో అధునాతన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దేశీయ అతిపెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్ అయిన నెక్సస్ మాల్స్‌ (Nexus Malls)తో పార్ట్‌నర్‌షిప్ ప్రకటించింది. ఈ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా జియో-బీపీ సంస్థ 13 నగరాల్లోని 17 నెక్సస్ మాల్స్‌లో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఈ నెక్సస్ మాల్‌లలో టూవీలర్, ఫోర్-వీలర్ ఈవీలకు రోజులో 24 గంటలూ ఛార్జింగ్ చేసుకునేలా స్టేషన్లను జియో-బీపీ ఇన్‌స్టాల్ చేయనుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఈ నెలలోనే హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌లలోని మాల్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు వాహనదారులు సిద్ధంగా ఉన్నా ఛార్జింగ్ స్టేషన్లు సరిపడా ఇంకా అందుబాటులోకి రాలేదు. కొందరు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా లేవనే కారణంతో వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు జియో-బీపీ తన వంతు కృషి చేస్తోంది. ఈవీ వాల్యూ చైన్‌లోని అన్ని వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే ఏకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తోంది. 2021లో ఈ కంపెనీ ఇండియాలో రెండు అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్‌లను నిర్మించడంతో పాటు వాటిని లాంచ్ కూడా చేసేసింది.

ఇదీ చదవండి: శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


నెక్సస్ మాల్స్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద మాల్ యజమానులలో ఒకటిగా వెలుగొందుతోంది. 13 ప్రముఖ నగరాల్లో 17 నెక్సస్ మాల్స్ ఇప్పటికే 100% బిజినెస్ పొందుతున్నాయి. కరోనా సమయంలో నెక్సస్ మాల్స్ తమ ప్రాంగణాలను చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు అనేక చర్యలు తీసుకున్నాయి. మేజర్ సిటీలలో నివసించే చాలామంది ప్రజలు ఈ మాల్స్‌కు డైలీ వస్తుంటారు. దీంతో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఈవీ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. దేశమంతటా కాకపోయినా కనీసం టైర్-1 నగరాల్లోనైనా ఈవీ వాహనదారుల సంఖ్య పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే వారు తమకు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను సులభంగా కనుగొనడానికి జియో-బీపీ పల్స్ (Jio-bp pulse) మొబైల్ యాప్ ఉపయోగించవచ్చు. తద్వారా వారు ఈవీలను ఛార్జ్ చేయవచ్చు.



దేశవ్యాప్తంగా ఈవీల కొనుగోళ్లు, ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాయితీలు, రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, రోడ్ ట్యాక్స్‌పై మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఫీజులపై ​​మినహాయింపు వంటి అనేక ప్రోత్సాహకాలు ఆఫర్ చేస్తోంది. ఈ ప్రోత్సాహకాలతో, రాబోయే సంవత్సరాల్లో ఈవీ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశముంది.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Charging, Electric Vehicle, Jio

తదుపరి వార్తలు