Jio Apps: ఈ జియో యాప్స్‌తో ఉపయోగాలెన్నో... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా?

Jio Apps | వేర్వేరు వార్తా సంస్థలకు చెందిన వార్తలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చేదే జియో న్యూస్ యాప్. లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోలు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ జియో న్యూస్ యాప్‌లో లభిస్తాయి.

news18-telugu
Updated: April 28, 2019, 10:03 AM IST
Jio Apps: ఈ జియో యాప్స్‌తో ఉపయోగాలెన్నో... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా?
Jio Apps: ఈ జియో యాప్స్‌తో ఉపయోగాలెన్నో... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా?
news18-telugu
Updated: April 28, 2019, 10:03 AM IST
రిలయెన్స్ జియో... టెలికామ్ రంగంలో సంచలనం. చాలా తక్కువ ధరకే మొబైల్ డేటా అందించడం ద్వారా జియో సేవలు గ్రామగ్రామాలకు విస్తరించాయి. అంతేకాదు... జియో యాప్స్ కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. యాప్ స్టోర్‌లో జియోకు చెందిన యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ 5 ముఖ్యమైన యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మీకెన్నో సేవలు లభిస్తాయి. మరి ఆ యాప్స్ ఏంటో? వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.

జియో బ్రౌజర్


ఇది రిలయెన్స్ జియోకు చెందిన బ్రౌజర్. నాన్ జియో యూజర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, మళయాళం, కన్నడ, బెంగాలీ భాషల్ని సపోర్ట్ చేస్తుంది ఈ యాప్. ఇందులో వీడియోల కోసం ప్రత్యేక సెక్షన్ ఉంది. జియో బ్రౌజర్‌ను యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో జియో బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే

జియో గ్రూప్ టాక్


జియో గ్రూప్ టాక్ ద్వారా ఒకేసారి 10 మందితో మాట్లాడొచ్చు. హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. జియో సిమ్ యూజర్ల కోసం ఈ యాప్ ప్రత్యేకం. జియో గ్రూప్ టాక్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


జియో న్యూస్ యాప్

Loading...
వేర్వేరు వార్తా సంస్థలకు చెందిన వార్తలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చేదే జియో న్యూస్ యాప్. లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోలు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ జియో న్యూస్ యాప్‌లో లభిస్తాయి. 12 భాషలకు చెందిన వార్తల్ని చూడొచ్చు. మీ ఆసక్తికి తగ్గట్టుగా పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, బిజినెస్, టెక్నాలజీ, లైఫ్‌స్టైల్, కెరీర్ సెక్షన్లను ఎంచుకోవచ్చు. జియో యూజర్లు మాత్రమే కాదు, నాన్-జియో యూజర్లు కూడా ఈ యాప్ వాడొచ్చు. జియో న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

జియో స్విచ్


ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌లోకి ఫైల్స్ పంపించడానికి, స్వీకరించడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సెండ్, రిసీవ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిని ఎంచుకొని ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. జియో సిమ్ లేసనివాళ్లు కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. జియో స్విచ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మై జియో-జియో క్రికెట్ ప్లే ఎలాంగ్


ఐపీఎల్ సీజన్‌లో ఈ యాప్ కాంటెస్ట్‌లో పాల్గొని రివార్డ్స్ పొందొచ్చు. మ్యాచ్ చూస్తూ ప్రశ్నలకు సమాధనాలు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కువ సరైన సమాధానాలు చెప్పినవారికి రివార్డ్స్ లభిస్తాయి. మై జియో-జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త

IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్
First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...