JIO APPS JIONEWS JIOBROWSER JIOGROUPTALK MYJIO JIOSWITCH THESE 5 BEST RELIANCE JIO APPS MAKES YOUR SMARTPHONE SMART SS
Jio Apps: ఈ జియో యాప్స్‌తో ఉపయోగాలెన్నో... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా?
Jio Apps: ఈ జియో యాప్స్‌తో ఉపయోగాలెన్నో... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా?
Jio Apps | వేర్వేరు వార్తా సంస్థలకు చెందిన వార్తలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చేదే జియో న్యూస్ యాప్. లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోలు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ జియో న్యూస్ యాప్‌లో లభిస్తాయి.
రిలయెన్స్ జియో... టెలికామ్ రంగంలో సంచలనం. చాలా తక్కువ ధరకే మొబైల్ డేటా అందించడం ద్వారా జియో సేవలు గ్రామగ్రామాలకు విస్తరించాయి. అంతేకాదు... జియో యాప్స్ కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. యాప్ స్టోర్‌లో జియోకు చెందిన యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ 5 ముఖ్యమైన యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మీకెన్నో సేవలు లభిస్తాయి. మరి ఆ యాప్స్ ఏంటో? వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.
జియో బ్రౌజర్
ఇది రిలయెన్స్ జియోకు చెందిన బ్రౌజర్. నాన్ జియో యూజర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, మళయాళం, కన్నడ, బెంగాలీ భాషల్ని సపోర్ట్ చేస్తుంది ఈ యాప్. ఇందులో వీడియోల కోసం ప్రత్యేక సెక్షన్ ఉంది. జియో బ్రౌజర్‌ను యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో జియో బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
వేర్వేరు వార్తా సంస్థలకు చెందిన వార్తలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చేదే జియో న్యూస్ యాప్. లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోలు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ జియో న్యూస్ యాప్‌లో లభిస్తాయి. 12 భాషలకు చెందిన వార్తల్ని చూడొచ్చు. మీ ఆసక్తికి తగ్గట్టుగా పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, బిజినెస్, టెక్నాలజీ, లైఫ్‌స్టైల్, కెరీర్ సెక్షన్లను ఎంచుకోవచ్చు. జియో యూజర్లు మాత్రమే కాదు, నాన్-జియో యూజర్లు కూడా ఈ యాప్ వాడొచ్చు. జియో న్యూస్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఒక ఫోన్ నుంచి మరో ఫోన్లోకి ఫైల్స్ పంపించడానికి, స్వీకరించడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సెండ్, రిసీవ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిని ఎంచుకొని ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. జియో సిమ్ లేసనివాళ్లు కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. జియో స్విచ్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.