Home /News /technology /

JIO ANNOUNCES 1 YEAR AMAZON PRIME MEMBERSHIP WORTH 999 AT NO EXTRA COST TO JIOFIBER USERS SK

JIO Fiber: జియో బంపర్ ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ ప్రైమ్ ఉచిత ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేయవచ్చు లేదంటే పాత ప్లాన్ లను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

    జియో మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ.999 విలువ చేసే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఐతే గోల్డ్‌, ఆపై ప్లాన్లు కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు, అమెజాన్‌ మ్యూజిక్‌ కూడా జియో ఫైబర్ వినియోగదారులకు ఉచితంగా లభించనుంది. జియో ఫైబర్‌ వాడుతున్న ప్రస్తుత వినియోగదారులు కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌ను ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేయవచ్చు లేదంటే పాత ప్లాన్ లను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

    అమెజాన్ ప్రైమ్‌తో జియో ఫైబర్ యూజర్లకు కలిగే లాభాలు:
    1. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన "గులాబో సితాబో' సినిమాను ఆస్వాదించవచ్చు.

    2. ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న అన్ని వీడియోలు వీక్షించవచ్చు.

    a.అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ)
    b. ఉచిత వేగవంతమైన డెలివరీ.
    c. టాప్ డీల్స్‌ను త్వరగా పొందవచ్చు.
    d. ప్రైమ్ యాడ్ ఫ్రీ మ్యూజిక్
    e. ప్రైమ్ గేమింగ్
    f. ప్రైమ్ రీడింగ్

    3. జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌ సబ్‌స్క్రిపక్షన్ చేసుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.

    అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఎలా పొందాలంటే:
    జియో ఫైబర్ గోల్డ్ లేదా పై ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి.
    మై జియో యాప్ లేదా JIO.COMలో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి.
    ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ చేయాలి.

    జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్  (రూ.1299) ఆఫర్లు:

    250 ఎంబీపీఎస్ వేగంతో డేటా
    అపరిమిత ఇంటర్నెట్ (నెలకు 1,750 జీబీ వరకు)
    అపరిమిత వాయిస్ కాలింగ్
    అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది)
    ఇతర జియో ఆప్‌లకు అన్ లిమిటెడ్ యాక్సెస్
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amazon prime, Jio fiber

    తదుపరి వార్తలు