హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio 5G Offer: జియో 5జీ ఆఫర్ వచ్చేసింది... 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio 5G Offer: జియో 5జీ ఆఫర్ వచ్చేసింది... 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio 5G Offer: జియో 5జీ ఆఫర్ వచ్చేసింది... 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio 5G Offer: జియో 5జీ ఆఫర్ వచ్చేసింది... 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio 5G Offer | దసరా నుంచి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో జియో ట్రూ 5జీ (Jio True 5G) బీటా ట్రయల్ ప్రారంభం అవుతుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మొబైల్ యూజర్స్ ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. జియో నుంచి 5జీ ఆఫర్‌పై (Jio 5G Offer) ప్రకటన వచ్చింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్‌లో భారతదేశంలో 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ప్రారంభించింది. దీపావళికి జియో సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ జియో ముందుగా ప్రకటించినా, దసరా పర్వదినాన నాలుగు నగరాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ప్రారంభం కానున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో జియో ట్రూ 5జీ బీటా ట్రయల్ దసరా నుంచి మొదలవుతుందని కంపెనీ ప్రకటించింది. దసరా 2G వంటి టెక్నాలజీల వల్ల కలిగే అడ్డంకులపై విజయానికి ప్రతీక అని, Jio True 5G నిజమైన జ్ఞానం లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

జియో ట్రూ 5జీ అందుబాటులోకి రాబోతున్న నాలుగు నగరాల్లో వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఇన్విటేషన్ల ద్వారా కస్టమర్లకు జియో ట్రూ 5జీ సేవల్ని అందించబోతుంది. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకొని సేవల్ని మెరుగుపర్చనుంది. 425 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్న జియో, 5జీ ద్వారా భారతదేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చే లక్ష్యాన్ని వేగవంతం చేయబోతోంది. ఈ కనెక్టివిటీ, సాంకేతికత ద్వారా జీవితాలను మెరుగుపరచడం, జీవనోపాధిని పెంచడం ద్వారా మానవాళికి సేవ చేయడంలో సహాయపడుతుంది.

Nothing Phone 1: త్వరపడండి... జస్ట్ రూ.10,000 ధరకే నథింగ్ ఫోన్ 1 కొనండి ఇలా

జియో ట్రూ 5జీ వీకేర్ సూత్రం ద్వారా నిర్మించబడింది. విద్య , ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు, IoT, స్మార్ట్ హోమ్‌లు, గేమింగ్‌లో 1.4 బిలియన్ల భారతీయులను ప్రభావితం చేసే మార్పులను తీసుకురానుంది. జియో ట్రూ 5జీ నెట్వర్క్‌తో మూడు రెట్లు ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

జియో ట్రూ 5జీ సత్తా

1. స్టాండ్ అలోన్ 5జీ: జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. తక్కువ జాప్యం, భారీ మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్, 5G వాయిస్, ఎడ్జ్ కంప్యూటింగ్. నెట్‌వర్క్ స్లైసింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇతర ఆపరేటర్‌లు ప్రారంభించిన 4G-బేస్డ్ నాన్-స్టాండలోన్ నెట్‌వర్క్‌ల కంటే చాలా గొప్పగా ఉంటుంది.

2. అతిపెద్ద స్పెక్ట్రమ్: 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో 5G కోసం అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ద్వారా, ఇతర ఆపరేటర్‌ల కంటే జియో ట్రూ 5జీ ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. డీప్ ఇండోర్ కవరేజీ ఇచ్చే 700MHz లో బ్యాండ్ స్పెక్ట్రమ్ జియో దగ్గర మాత్రమే ఉంది.

3. క్యారియర్ అగ్రిగేషన్: క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి 5G ఫ్రీక్వెన్సీలను కలిపి ఒకే ఫ్రీక్వెన్సీగా ఇస్తుంది. కవరేజ్, సామర్థ్యం, నాణ్యత, తక్కువ ధర లాంటి అసమానమైన కలయికను అందిస్తుంది.

5G Mobile: 5జీ ఫోన్ కొనాలా? కాస్త ఆగండి... రూ.10,000 లోపు 5జీ మొబైల్ వస్తోంది

డిజిటల్ ఇండియా పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి భారతదేశం అంతటా 5G వేగవంతమైన రోల్-అవుట్ కోసం మన ప్రధాన మంత్రి ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు. అందుకు అనుగుణంగా దేశం కోసం జియో ప్రతిష్టాత్మకమైన, వేగవంతమైన 5G రోల్-అవుట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. భారతదేశం డిజిటల్ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. జియో 5జీ నిజమైన 5G అవుతుంది. జియో 5జీ అనేది ప్రతీ భారతీయుడి కోసం భారతీయులు నిర్మించిన, ప్రపంచంలోని అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్. 5Gని స్వీకరించడం ద్వారా, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం లాంటి అనేక రంగాలను మార్చే దేశ-మొదటి ప్లాట్‌ఫామ్‌ను, పరిష్కారాలను జియో సృష్టిస్తుంది. 5G అతిపెద్ద నగరాల్లో ఉన్నవారికి అందుబాటులో ఉండే ప్రత్యేక సేవగా ఉండకూడదు. భారతదేశం అంతటా ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపారానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అప్పుడే మనం మన మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత, ఆదాయాలు, జీవన ప్రమాణాలను పెంచుకోగలము. తద్వారా మన దేశంలో సంపన్నమైన, సమ్మిళిత సమాజాన్ని సృష్టించగలం.

ఆకాశ్ ఎం అంబానీ, ఛైర్మన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్

జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్

జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఇన్విటేషన్ ద్వారా ఈ ఆఫర్ అందిస్తోంది. కస్టమర్లకు 1 Gbps+ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది కంపెనీ. ఇతర నగరాల్లో కూడా బీటా ట్రయల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ నగరంలో ప్రతి కస్టమర్‌కు ఉత్తమమైన కవరేజీ, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ లభించేవరకు బీటా ట్రయల్ కొనసాగుతుంది.

జియో వెల్‌కమ్ ఆఫర్ కస్టమర్లు తమ ప్రస్తుత జియో సిమ్ లేదా 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా జియో ట్రూ 5జీ సేవల్ని పొందొచ్చు. కస్టమర్లకు జియో 5జీ సేవల్ని వారి 5జీ మొబైల్స్‌లో మెరుగ్గా అందించేందుకు కంపెనీ అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Akash Ambani, Jio, Jio 5G, Jio TRUE 5G, Reliance Jio

ఉత్తమ కథలు