హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

GAMING MASTERS 2.0: జియోగేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0 ఈవెంట్... గెలిస్తే రూ.12,50,000 బహుమతి

GAMING MASTERS 2.0: జియోగేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0 ఈవెంట్... గెలిస్తే రూ.12,50,000 బహుమతి

GAMING MASTERS 2.0: జియోగేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0 ఈవెంట్... గెలిస్తే రూ.12,50,000 బహుమతి

GAMING MASTERS 2.0: జియోగేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0 ఈవెంట్... గెలిస్తే రూ.12,50,000 బహుమతి

GAMING MASTERS 2.0 | జియో, మీడియాటెక్ కలిసి గేమింగ్ మాస్టర్స్ 2.0 (GAMING MASTERS 2.0) ఇస్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. రూ.12,50,000 ప్రైజ్ మనీని ప్రకటించాయి. ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.

  వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి అలర్ట్. రిలయన్స్ జియో, మీడియాటెక్ సంయుక్తంగా బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్‌తో గేమింగ్ మాస్టర్స్ 2.0 (GAMING MASTERS 2.0) ఇస్పోర్ట్స్ ఈవెంట్‌ను ప్రకటించాయి. భారతదేశంలో ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారితో పాటు ప్రొఫెషనల్ గేమర్స్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి సెషన్‌లో ఫ్రీ ఫైర్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో 14,000 టీమ్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో గేమింగ్ మాస్టర్స్ సెకండ్ సీజన్‌ను ప్రకటించాయి. గేమింగ్ మాస్టర్స్ 2.0 ఇస్పోర్ట్స్ ఈవెంట్ 2021 నవంబర్ 21 ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రొఫెషనల్ గేమర్స్‌తో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.

  Price Hike: అలర్ట్... రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

  గేమింగ్ మాస్టర్స్ 2.0 ఇస్పోర్ట్స్ ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ 2021 నవంబర్ 12న ప్రారంభం అయ్యాయి. https://play.jiogames.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. జియో యూజర్లు మాత్రమే కాదు నాన్ జియో యూజర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పార్టిసిపేషన్ ఫీజు లేదు. మరిన్ని వివరాల కోసం https://play.jiogames.com వెబ్‌సైట్ చూడొచ్చు. 2021 నవంబర్ 23 నుంచి 2022 జనవరి 10 వరకు టోర్నమెంట్ జరుగుతుంది. జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్‌డీ ఇస్పోర్ట్స్ ఛానల్, ఫేస్‌బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఈవెంట్‌ను లైవ్‌లో చూడొచ్చు.

  Disable Ads: ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటే యాడ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా? ఈ ట్రిక్స్ మీకోసమే

  BATTLEGROUNDS MOBILE INDIA BGMI, Gaming Masters 2.0, Gaming Masters second season, Jio esports event, MediaTek esports event, గేమింగ్ మాస్టర్స్ 2.0, గేమింగ్ మాస్టర్స్ రెండో సీజన్, గేమింగ్ మాస్టర్స్ సెకండ్ సీజన్, జియో ఇస్పోర్ట్స్ ఈవెంట్, మీడియాటెక్ ఇస్పోర్ట్స్ ఈవెంట్

  గేమింగ్ మాస్టర్స్‌లో క్రాఫ్టన్ హిట్ బ్యాటిల్ రాయల్ గేమ్ టైటిల్ అయిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఉంటుంది. జియోగేమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జియో యూజర్లు, నాన్ జియోయూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ టోర్నమెంట్ గేమర్స్ స్కిల్స్, టీమ్ వర్క్‌ను, ఓపికను పరీక్షిస్తుంది. ఈ గేమ్‌లో గెలిచినవారికి రూ.12,50,000 బహుమతి ప్రకటించింది జియో, మీడియాటెక్. దీంతో పాటు Play & Win Daily సిరీస్ కూడా ఉంది. ఇందులో ప్రతీ రోజు గేమర్స్ పాల్గొని రివార్డ్స్ పొందొచ్చు. అంతేకాదు... అల్టిమేట్ ఛాంపియన్‌షిప్‌లో ప్రొఫెషనల్ టీమ్స్‌తో పోటీపడే ఛాన్స్ కూడా వస్తుంది.

  November Smartphones: నవంబర్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  భారతదేశంలో డిజిటల్ సేవల్ని అందించే అతిపెద్ద సంస్థ అయిన జియో, ప్రపంచంలోనే నాలుగో సెమీకండక్టర్ కంపెనీ అయిన మీడియాటెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇస్పోర్ట్స్ గేమింగ్ ఈవెంట్ గేమింగ్ మాస్టర్స్. భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. భారతదేశంలో మీడియాటెక్ ఆన్‌లైన్ గేమింగ్‌లో ముందంజలో ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ సిరీస్, మీడియాటెక్ హీలియో జీ సిరీస్ చిప్‌సెట్లలో ఇవి అధునాతన మీడియాటెక్ హైపర్‌ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ ఉన్న సంగతి తెలిసిందే.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Games, Jio, Reliance Jio, Video Games

  ఉత్తమ కథలు