హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

మరో సంచలనానికి సిద్ధమైన Jio.. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లతో పాటు..

మరో సంచలనానికి సిద్ధమైన Jio.. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లతో పాటు..

తక్కువ ధరకు డేటా అందించి టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అయితే సంస్థ తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను అందించాలని యోచిస్తోంది. తద్వారా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది.

తక్కువ ధరకు డేటా అందించి టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అయితే సంస్థ తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను అందించాలని యోచిస్తోంది. తద్వారా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది.

తక్కువ ధరకు డేటా అందించి టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అయితే సంస్థ తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను అందించాలని యోచిస్తోంది. తద్వారా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది.

  టెలికాం రంగంలో డేటా విప్లవం సృష్టించిన జియో మరో సరి కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. మరిన్ని సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. సబ్ స్క్రైబర్లను పెంచుకోవడమే లక్ష్యంగా సంస్థ సరి కొత్త వ్యూహాలను సిద్ధం చేసకుంటుంది. జియో ఫోన్లపై ఆఫర్లు ఇవ్వనుంది. అంతే కాకుండా తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేయడానికి జియో సిద్ధమైంది. తద్వారా భారీగా సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలన్న వ్యూహంతో సంస్థ ముందుకు వెళ్తోంది. ఇలా చేయడం ద్వారా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఇవ్వడం, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ద్వారా సబ్ స్క్రైబర్ల పెరుగుదలను నమోదు చేయవచ్చని జీయో యోచిస్తోంది. తద్వారా మార్కెట్లో తనకు తిరుగు లేదని మరో సారి నిరూపించుకోవాలన్నది సంస్థ వ్యూహంగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులగా జీయో నుంచి స్మార్ట్ ఫోన్లు వస్తాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

  తక్కువ ధరకు డేటా అందించి దేశంలో ఇంటర్ నెట్ విప్లవాన్ని తీసుకువచ్చిన జియో నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్లపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఫోన్ల కోసం అనేక మంది మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు విడుదలైతే మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని అనేక మంది భావిస్తున్నారు. ఈ విషయమై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

  ఇదిలా ఉంటే.. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు నిర్వహించేవారికి 'జియో బిజినెస్' పేరుతో సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. తక్కువ ధరకే డేటా, వాయిస్ సేవల్ని అందిస్తోంది. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ నెలకు రూ.901 రెంటల్‌తో ప్రారంభమవుతాయి. రూ.10,001 వరకు ప్లాన్స్ ఉన్నాయి. వేర్వేరు ప్లాన్స్‌కి బెనిఫిట్స్ కూడా వేరుగా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి.

  JioBusiness Rs 901 Plan: జియోబిజినెస్ రూ.901 ప్లాన్ తీసుకుంటే 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఒక లైన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు.

  JioBusiness Rs 1,201 Plan: జియోబిజినెస్ రూ.1,201 ప్లాన్ తీసుకుంటే 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. రెండు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది.

  First published:

  Tags: Jio, Jio phone, Reliance JioMart

  ఉత్తమ కథలు