JIO ADDS OVER 1 48 LAKH NEW SUBSCRIBERS IN TELANGANA AND AP IN FEBRUARY AND BECOMES TOP IN DOWNLOAD SPEED NS
Jio: తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతున్న జియో.. కొత్తగా ఎంతమంది చందాదారులు చేరారో తెలిస్తే షాకే..
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీగా చందాదారుల చేరికలతో జియో దుమ్ములేపుతోంది. ట్రాయ్(TRAI) తాజాగా విడుదల చేసిన గణంకాల ప్రకారం డేటా డౌన్ లోన్ స్పీడ్ లోనూ జియో అగ్రస్థానంలో ఉంది.
తెలుగురాష్ట్రాల్లో జియో హవా ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస ఆఫర్లతో దుమ్ములేపుతు ఈ టెలికాం సంస్థ ఎప్పటికప్పుడు కస్టమర్ల మనస్సులు గెలుచుకుంటూ తన నం.1 స్థానాన్ని స్థిరంగా కొనసాగిస్తూనే ఉంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో గడచిన ఫిబ్రవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను జియో సంపాధించుకోవడం విశేషం. దీంతో ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో జియో తన మార్కెట్ నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఫిబ్రవరి నాటికి 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది. ట్రాయ్ ప్రచురించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి లో జియో అత్యధికంగా 1,48,278 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. తరువాతి స్థానంలో ఎయిర్టెల్(Airtel) 72,559 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోయని ట్రయ్ లెక్కలు చెబుతున్నాయి. Jio Plans: లాక్డౌన్ లో ఎక్కువ డేటా వాడే వారికి జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో తక్కువ ధరకు ఎక్కువ డేటా.. వివరాలివే
దేశవ్యాప్తంగా చూస్తే జియో అత్యధికంగా 42.66 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకుంది. ఎయిర్టెల్ కు కొత్తగా మరో 37.3 లక్షల కస్టమర్లు చేరారు. వోడాఫోన్ ఐడియా 6.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. బీఎస్ఎన్ఎల్ 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2021 లో దేశంలో మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య 82,92,668 కు పెరిగింది.
డౌన్లోడ్ వేగంలోనూ జియోనే టాప్..
డేటా డౌన్లోడ్ స్పీడ్ లోను రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో అగ్రస్థానంలో ఉంది. జియో తన సమీప పోటీదారు వోడాఫోన్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ డౌన్లోడ్ వేగాన్ని కలిగి ఉంది. మే 11 న అప్డేట్ చేసిన ట్రాయ్ డేటా ప్రకారం వోడాఫోన్ ఏప్రిల్‌లో 7 ఎమ్‌బిపిఎస్ డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఐడియా మరియు ఎయిర్టెల్ తరువాత వరుసగా 5.8 ఎమ్‌బిపిఎస్ మరియు 5 ఎమ్‌బిపిఎస్ డౌన్లోడ్ వేగంతో ఉన్నాయి. నెట్వర్క్ అప్లోడ్ విభాగంలో 6.7 ఎమ్‌బిపిఎస్ వేగంతో వోడాఫోన్ అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత ఐడియా 6.1 ఎమ్‌బిపిఎస్, జియో 4.2 ఎమ్‌బిపిఎస్ మరియు ఎయిర్టెల్ 3.9 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.