Home /News /technology /

JIO 3GB DATA PLANS RELIANCE JIO OFFERS 3GB DAILY MOBILE DATA ON THESE 4 PREPAID RECHARGE PLANS SS

Jio 3GB Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే జియో ప్లాన్స్ ఇవే

Jio 3GB Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే జియో ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio 3GB Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే జియో ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio 3GB Data Plans | రోజూ 2జీబీ కన్నా ఎక్కువ మొబైల్ డేటా ఉపయోగిస్తున్నారా? రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం రోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్స్ (Jio 3GB Data Plans) రూపొందించింది. ఈ ప్లాన్స్‌పై వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఇంకా చదవండి ...
తక్కువ ధరకే మొబైల్ డేటాను రిలయన్స్ జియో (Reliance Jio) పరిచయం చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఒకప్పుడు నెల మొత్తం 1జీబీ డేటా లేదా 2జీబీ డేటా మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రోజూ 2జీబీ డేటా (Daily 2GB data plans) కూడా సరిపోవట్లేదు. సినిమాలు, వీడియోలు చూసేవారికి, ఆన్‌లైన్ క్లాసులు వినేవారికి రోజూ 2జీబీ డేటా చాలదు. అందుకే వారి కోసం రోజూ 3జీబీ డేటాతో (Daily 3GB data plans) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది రిలయన్స్ జియో. రోజూ మొబైల్‌లో ఎక్కువగా ఇంటర్నెట్ వాడేవారు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

Jio Rs 419 Plan: రిలయన్స్ జియో రూ.419 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

Budget Smartphone: పవర్‌ఫుల్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, ఏఐ కెమెరా... ధర రూ.7,499 మాత్రమే

Jio Rs 601 Plan: రిలయన్స్ జియో రూ.601 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

Jio Rs 1199 Plan: రిలయన్స్ జియో రూ.1199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 252జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

Samsung Galaxy F13: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్



Jio Rs 4199 Plan: రిలయన్స్ జియో రూ.4199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 1095జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.1499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు