Shock: ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి 1,66,000 ఉద్యోగుల ఆధార్ డేటా లీక్

1,66,000 ఉద్యోగుల డేటా ఉన్న సిస్టమ్‌కు అసలు పాస్‌వర్డ్ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు కాదు... 2014 నుంచి పాస్‌వర్డ్ లేకుండానే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారంటే... వెబ్‌సైట్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: February 1, 2019, 5:57 PM IST
Shock: ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి 1,66,000 ఉద్యోగుల ఆధార్ డేటా లీక్
Shock: ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి 1,66,000 ఉద్యోగుల ఆధార్ డేటా లీక్
news18-telugu
Updated: February 1, 2019, 5:57 PM IST
ఆధార్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన ఓ వెబ్‌సైట్ నుంచి ఏకంగా 1,66,000 ఉద్యోగుల ఆధార్ డేటా లీకవడం కలకలం రేపుతోంది. ఉద్యోగుల అటెండెన్స్‌ను రికార్డ్ చేసే వ్యవస్థకు 2014 నుంచి అసలు పాస్‌వర్డ్ లేదన్న విషయం తాజాగా బయటపడింది. ప్రభుత్వ వెబ్‌సైట్ నిర్వహణలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన ద్వారా రుజువవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ అయిన టెక్‌క్రంచ్ కథనం బయటపెట్టింది. లక్షలాది మంది కస్టమర్ల డేటా ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని రెండు రోజుల క్రితమే టెక్ క్రంచ్ వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వ వెబ్‌సైట్ నిర్వహణ తీరు బయటపడింది.

Read this: Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్

2014 నుంచి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేని అటెండెన్స్ సిస్టమ్‌లో జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు, హోదా, పదవి, ఆధార్ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. 1,66,000 ఉద్యోగుల డేటా ఉన్న సిస్టమ్‌కు అసలు పాస్‌వర్డ్ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు కాదు... 2014 నుంచి పాస్‌వర్డ్ లేకుండానే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారంటే... వెబ్‌సైట్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటా లీకేజీ వ్యవహారంపై జార్ఖండ్ ప్రభుత్వం గానీ, UIDAI గానీ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:



Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?

Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్
First published: February 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు