హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JBL Earbuds: సరికొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్ చేసిన జేబీఎల్.. ట్రూ వైర్‌లెస్ బడ్స్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

JBL Earbuds: సరికొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్ చేసిన జేబీఎల్.. ట్రూ వైర్‌లెస్ బడ్స్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆడియో ప్రొడక్ట్స్‌తో ఇండియన్ గాడ్జెట్స్ యూజర్ల దృష్టిని ఆకర్షించిన హార్మాన్ ఇండియా, JBL సంస్థ.. తాజాగా భారత మార్కెట్లో రెండు జతల కొత్త ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. ఈ ఆడియో కంపెనీ జేబీఎల్ ట్యూన్ 130 NC (JBL Tune 130 NC), జేబీఎల్ ట్యూన్ 230 NC (JBL Tune 230 NC) పేరుతో రెండు జతల ఇయర్ బడ్స్‌ లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...

ఆడియో ప్రొడక్ట్స్‌తో(Audio Products) ఇండియన్ గాడ్జెట్స్(Indian Gadgets) యూజర్ల దృష్టిని ఆకర్షించిన హార్మాన్ ఇండియా(India), JBL సంస్థ.. తాజాగా భారత మార్కెట్లో రెండు జతల కొత్త ఇయర్‌బడ్స్‌ను(Ear buds) ఆవిష్కరించింది. ఈ ఆడియో కంపెనీ జేబీఎల్ ట్యూన్ 130 NC (JBL Tune 130 NC), జేబీఎల్ ట్యూన్ 230 NC (JBL Tune 230 NC) పేరుతో రెండు జతల ఇయర్ బడ్స్‌ లాంచ్ చేసింది. ఇవి 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించగలవు. క్వాలిటీ కాల్స్, ఇతర ఫీచర్‌లకు సపోర్ట్ చేసే 4-మైక్ టెక్నాలజీతో వచ్చాయి. ఈ ప్రొడక్ట్స్ లాంచింగ్ గురించి హర్మాన్ ఇండియా లైఫ్ స్టైల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ ఖేర్ మాట్లాడారు. ‘కొత్త ట్రూ వైర్‌లెస్ JBL ట్యూన్ 230 NC, JBL 130 NC రెండూ కస్టమర్ డిలైట్ ఇయర్‌బడ్స్.

వీటిని యూజర్ల విభిన్న అవసరాలు, మనోభావాలకు అనుగుణంగా రూపొందించాం. JBL సౌండ్ ఇంజనీరింగ్ అడాప్షన్‌తో ఈ ప్రొడక్ట్స్ సాటిలేని కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. స్టైల్, క్వాలిటీ, సౌలభ్యం, నాయిస్ క్యాన్సిలేషన్, కస్టమైజేషన్, ఆకర్షణీయమైన ధర.. అన్నింటి కలయికలో JBL ట్యూన్‌ ప్రొడక్ట్స్ లభిస్తాయి.’ అని వివరించారు.

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..


* ధర ఎంతంటే..

JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప్రారంభమవుతోంది. మన దేశంలో JBL 230NC ప్రారంభ ధరను రూ. 5999గా నిర్ణయించారు. జేబీఎల్ ట్యూన్ 230 NC బడ్స్ మే 3 నుంచి హర్మాన్ బ్రాండ్ స్టోర్‌లు, in.JBL.com, అన్ని ఇతర ప్రధాన రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. జేబీఎల్ ట్యూన్ 130 NC బడ్స్.. హర్మాన్ బ్రాండ్ స్టోర్స్, JBL సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అన్ని ఇతర ప్రధాన రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌లలో కూడా లభిస్తాయి.

* ఇయర్‌బడ్స్ ఫీచర్లు

జేబీఎల్ ట్యూన్ 230 NC బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్, యాంబియంట్ అవేర్, టాక్ త్రూ ఫీచర్‌లతో కూడిన స్మార్ట్ యాంబియంట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇయర్‌బడ్స్ 40 గంటల వరకు ప్లే టైమ్‌ను అందిస్తాయి. 10 + 30 గంటలు (కేస్‌, BTతో), 8 + ANC ఆన్‌లో 24 గంటలు ప్లే టైమ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్స్ 4-మైక్ టెక్నాలజీతో రిలీజ్ అయ్యాయి. ఇవి క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయి. వీటితోపాటు గూగుల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్స్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ JBL హెడ్‌ఫోన్స్ యాప్‌కు మరింత కంపాటబుల్‌గా ఉంటాయి.

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మెగా ఐపీవో ప్రారంభం.. షేర్లు కొనుగోలు చేసే ముందు వీటిని తెలుసుకోండి..


JBL 130NC బడ్స్ కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్మార్ట్ యాంబియంట్, అవేర్ టాక్‌ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ 40 ప్లే టైమ్‌ను అందిస్తాయి. 10 + 30 గంటలు (BTతో).. 8 + 24 గంటలు (ANC ఆన్‌లో) ప్లే టైమ్‌ను అందిస్తాయి. క్వాలిటీ కాల్స్ కోసం వీటిలో 4-మైక్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ బడ్స్ గూగుల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్స్‌కు సపోర్ట్ చేస్తాయి.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Ear buds, Technology

ఉత్తమ కథలు