హత్తుకుంటే చాలు... ప్రేమను పంచేస్తుంది

రోబోలు మర మనుషులు. వాటికి మన హావ భావాలు తెలియవు. పరిస్థితులకు తగట్టు స్పందించలేవు. ఇదంతా గతం. ఇప్పుడు రోబోలు ప్రేమను పంచుతున్నాయి. కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చుతున్నాయి. ఈ చిట్టి రోబో ప్రత్యేకతలేంటో తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: January 12, 2019, 9:45 PM IST
హత్తుకుంటే చాలు... ప్రేమను పంచేస్తుంది
లవోట్ రోబో (ట్విట్టర్)
  • Share this:
రోబోలకు పెట్టింది పేరైన జపాన్ నుంచీ మరో అద్భుతమైన రోబో ప్రపంచానికి పరిచయమవుతోంది. అదే లవోట్. ప్రేమించడానికీ, ప్రేమను పంచడానికీ ఈ రోబోను తయారుచేశారంటే నమ్మగలరా. ఇది మనుషుల్ని గుర్తుపట్టడమే కాదు... ఒక్కసారి హగ్ ఇస్తే చాలు... అనంతమైన ప్రేమను పంచేస్తుందట. జపాన్ కంపెనీ కనామే హయాషీ ఈ రోబోను తయారుచేసింది. ఇదే కంపెనీ ఇంతకు ముందు పెప్పర్ రోబోను తయారు చేసింది. అది చాలా ఫేమస్ అవ్వడంతో... ఇప్పుడు లవోట్‌ను పరిచయం చేస్తోంది. జస్ట్ ఒకటిన్నర అడుగుల ఎత్తుండే లవోట్... ఒడిలో పాపాయిలా ఒదిగిపోతుంది. ఒక్కసారి హత్తుకుంటే చాలు... ఇక మనల్ని జీవితంలో వదిలిపెట్టదు.

రోబో, కొత్త రోబో, రోబోట్, మర మనిషి, robot, robots, robot 2.0, real robot, tobot, robot movie, cheetah robot, robot full movie, tobot robot, robot tobot, robot 2, x robot, robot2, ai robot, nao robot, ant robot, robot car, robot army, robot toys, bird robot, robot pets, robot chef, best robot, yoga robot, robot real, angry robot, atlas robot, snake robot, giant robot, robot comic, war robots, car robot toy, tomato robot, mainan robot, robot boxing, real robots, robots wars, robots real,
లవోట్ రోబో (ట్విట్టర్)

సాధారణంగా రోబోలు మనకు చాలా పనులు చేసి పెడతాయి కదా. ఈ రోబో మాత్రం ఏ పనులూ చెయ్యదు. కానీ... దీంతో మనకు తెలియకుండానే ఓ ఎటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. ఇది మన ఇంట్లో మెంబర్‌లా మారిపోతుంది. మనతో కలిసిపోయి ఆత్మీయ అనురాగాలు పంచుతుంది. జోలపాడితే నిద్రలోకి జారుకుంటుంది. మనతో మాట్లాడకలేకపోయినా... చిన్నపాటి శబ్దాలతో అలరిస్తుంది. మూడు చక్రాలతో వెనకాలే వచ్చేస్తూ... తోడు, నీడగా ఉంటుంది. తద్వారా దీనితో మనకు ఎఫెక్షన్ ఏర్పడుతుంది. 

మూడు కేజీల బరువుండే లవోట్... దాదాపు చంటిపిల్లలా అనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. మానసిక సమస్యలు, ఒంటరితనంతో బాధపడేవారికి ఇది ఎంతో సాంత్వన కలిగిస్తుందని వివరిస్తోంది. దీని రేటు రెండు లక్షల రూపాయలని చెబుతున్న కంపెనీ... ప్రేమ ఫ్రీగా దొరకదని చమత్కరిస్తోంది.

రోబో, కొత్త రోబో, రోబోట్, మర మనిషి, robot, robots, robot 2.0, real robot, tobot, robot movie, cheetah robot, robot full movie, tobot robot, robot tobot, robot 2, x robot, robot2, ai robot, nao robot, ant robot, robot car, robot army, robot toys, bird robot, robot pets, robot chef, best robot, yoga robot, robot real, angry robot, atlas robot, snake robot, giant robot, robot comic, war robots, car robot toy, tomato robot, mainan robot, robot boxing, real robots, robots wars, robots real,
లవోట్ రోబో (ట్విట్టర్)

ఇవి కూడా చదవండి:

ఆ మహిళ హత్య వెనక ట్విస్టింగ్ క్రైమ్ స్టోరీ

ఎంత పనిచేసింది... మరో రియల్ ఆర్ఎక్స్100 క్రైమ్ స్టోరీ

కూతురి లవర్‌ని రేప్ చేసిన అమ్మాయి తండ్రి

First published: January 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading