JACK DORSEY THE FOUNDER OF THE COMPANY THAT ADVOCATED TWITTER TAKEOVER GH VB
Jack Dorsey: ట్విట్టర్ టేకోవర్‌ను సమర్థించిన కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. ట్వీట్లో ఆసక్తికరమైన విషయాలు..
ట్విట్టర్ టేకోవర్‌ను సమర్థించిన కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎట్టకేలకు షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్ల (రూ.3.37 లక్షల కోట్లు) ఒప్పందంతో ఆయన ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) ఎట్టకేలకు షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్(Twitter)ను భారీ ధరకు కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్ల (రూ.3.37 లక్షల కోట్లు) ఒప్పందంతో ఆయన ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మస్క్ ఇంతకుముందు ట్విటర్లో 9.2 శాతం వాటాను 3 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత కంపెనీ బోర్డులో చేరలేకపోవడంతో తన వాటాను పెంచుకున్నారు. మొత్తానికి సంస్థ మస్క్ (Elon Musk)చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయంపై ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే(Jack Dorsey) మాట్లాడుతూ ఈ టేకోవర్‌కు మద్దతు తెలిపారు. వాల్ స్ట్రీట్(Wall Street) నుంచి ట్విట్టర్‌ను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో ‘ఇది సరైన, మొదటి అడుగు’ అని చెప్పారు.
ఒక ట్వీట్లో ఆసక్తికరమైన విషయాలను డోర్సే షేర్ చేశారు. ప్రపంచ స్పృహకు (global consciousness) దగ్గరగా ఉన్న విషయం ట్విట్టర్ అని చెప్పారు. తనకు సంబంధించినంత వరకు ఆలోచన (idea), సేవ (service) అన్నింటికీ ముఖ్యమైనవని, ఈ రెండింటినీ రక్షించడానికి ఏమైనా చేస్తానని పేర్కొన్నారు. ట్విట్టర్ వ్యవస్థాపకులు అయిన డోర్సే.. ట్విట్టర్ బోర్డుకు వోకల్ క్రిటిక్‌గా భావాలను వ్యక్తపరుస్తుంటారు. ఒక కంపెనీగా ట్విట్టర్‌తో తనకు ఎల్లప్పుడూ సమస్యలు ఉన్నాయని చెప్పారు. తన దృష్టిలో కంపెనీ "అతిపెద్ద విచారం" (biggest regret) అని పేర్కొన్నారు. "వాల్ స్ట్రీట్ లోని యాడ్ మోడల్ విధానంలో పనిచేస్తున్న కంపెనీ ఇది. వాల్ స్ట్రీట్ నుంచి దీన్ని వెనక్కి తీసుకోవడం సరైన మొదటి అడుగు" అని డోర్సే చెప్పారు.
I love Twitter. Twitter is the closest thing we have to a global consciousness.
ఎవరైనా ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలని లేదా నడపాలని భావించడాన్ని తాను నమ్మనని డోర్సే తెలిపారు. ట్విట్టర్‌ను ఒక కంపెనీగా కాకుండా ప్రోటోకాల్ స్థాయిలో ప్రజా ప్రయోజనంగా భావించాలన్నారు. ఒక కంపెనీగా ట్విటర్‌కు ఉన్న సమస్యను ఎలాన్ మస్క్ పరిష్కరించగలరని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇందుకు ఏకైక పరిష్కారం మస్క్ అని పేర్కొన్నారు. స్పృహ (consciousness) అనే కాంతిని విస్తరించాలనే మస్క్ మిషన్‌ను విశ్వసిస్తున్నట్లు ట్వీట్లో వెల్లడించారు.
విశ్వసనీయమైన, విస్తృతంగా కలుపుకొనిపోయే ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించాలనే మస్క్ లక్ష్యానికి కూడా డోర్సే మద్దతు ఇచ్చారు. ఈ లక్ష్యం సరైనదేనని చెప్పారు. కంపెనీకి సంబంధించినంత వరకు, సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు కూడా ఈ లక్ష్యం ఉందన్నారు. అందుకే తన వారసుడిగా పరాగ్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరాగ్, మస్క్‌కు డోర్సే ధన్యవాదాలు తెలిపారు. అసాధ్యమైన పరిస్థితి నుంచి కంపెనీని బయటపడేయడం లక్ష్యంగా పనిచేయడంలో వీరిద్దరూ సమ ఉజ్జీలని చెప్పారు.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఒక సంస్థ ప్రతి షేరుకు $54.20 క్యాష్ రూపంలో చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ వివరాలను ట్విట్టర్ ధ్రువీకరించింది. మస్క్ ట్విట్టర్‌ను దాదాపు $44 బిలియన్లకు కొనుగోలు చేశారు. దీంతో ట్విట్టర్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీగా మారనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.