• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • IVERMECTIN WHAT IS IVERMECTIN HOW IT WORKS AGAINST COVID 19 WHAT STUDIES SHOW RESULTS ABOUT IT EFFICACY NK GH

Ivermectin: కరోనాకి మరో టాబ్లెట్... పనితీరు అద్భుతం... ఇక వైరస్ ఖతం

కరోనాకి మరో టాబ్లెట్... పనితీరు అద్భుతం (image credit - twitter and NIAID)

Ivermectin: ఈ భూమిపై మనుషులకు సవాల్ విసిరిన కరోనాకి ప్లవ నామ సంవత్సరంలో మూడే రోజులు దగ్గర పడినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ టాబ్లెట్... ఆ వైరస్ అంతు చూస్తోంది. ఎలాగో తెలుసుకుందాం.

  • Share this:
కరోనా చికిత్స కోసం రకరకాల మందులు ప్రచారంలో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా ‘ఐవర్‌మెక్టిన్’ (Ivermectin)​ అనే టాబ్లెట్​ బాగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటి ద్వారా వేసుకునే ఈ యాంటీ పారాసిటిక్ టాబ్లెట్‌ని క్రమం తప్పకుండా వాడటం వల్ల కరోనా సోకే ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించిన తర్వాత, కరోనాను అంతం చేయడంలో ఈ మందు సూపర్ అని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై చేసిన పరిశోధన వివరాల్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాప్యూటిక్స్ మే - జూన్ ఎడిషన్‌లో రాశారు. క్లినికల్, ఇన్‌విట్రో, యానిమల్, రియల్-వరల్డ్ స్టడీస్ నుంచి తీసుకున్న డేటాను విశ్లేషించి ఐవర్‌మెక్టిన్‌పై పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

యావత్​ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులతో పాటు కొత్త వాటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎక్కువగా వాడుతున్న యాంటీ-పారాసైట్​టాబ్లెట్ ఐవర్‌మెక్టిన్‌పై 2020 నుంచే అధ్యయనాలు జరుగుతున్నాయి. కొన్ని పరిశోధనల సమాచారాన్ని ‘ఫ్రంట్​లైన్​కొవిడ్​క్రిటికల్​కేర్​అలయన్స్​’ (FLCCC) పేరుతో ఏర్పాటైన అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం విశ్లేషించింది. సమగ్ర విశ్లేషణ తర్వాత ఈ టాబ్లెట్ ద్వారా కరోనా చావగలదని నిర్థారణకు వచ్చామని FLCCC చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు.

2,500 మంది రోగులపై అధ్యయనం:
2021 జనవరి నాటికి అందుబాటులో ఉన్న దాదాపు 27 విధానాల ద్వారా అధ్యయనం చేశామని.. మొత్తం 15 రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ (RCT) ఉన్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఐవర్‌మెక్టిన్‌తో చికిత్స పొందిన రోగుల మరణాలు భారీగా తగ్గయని, వారు కోలుకునే సమయం కూడా బాగా తగ్గించగలిగామని వైరల్ క్లియరెన్స్‌ రచయితలు తెలిపారు.

ఐవర్‌మెక్టిన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, దాదాపు 2,500 మంది రోగులపై 3 RCT పరీక్షలు జరిపనట్లు పరిశోధకులు తెలిపారు. క్రమం తప్పకుండా దీన్ని ఉపయోగించినప్పుడు రోగుల్లో కరోనా సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించినట్లు అన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: Heart Attack: మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే... హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం

ఇప్పటికే రోగనిరోధక శక్తిని పునరుత్తేజపర్చడంతో పాటు కోవిడ్​ చికిత్సలో భాగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దీన్ని విరివిగా ఈ జౌషధాన్ని వాడుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు. కాగా, కోవిడ్​ చికిత్సలో ఐవర్‌మెక్టిన్​సమర్థవంతమైన సురక్షితమైన జౌషధం అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదని అమెరికాలోని ఈస్టర్న్​వర్జీనియా మెడికల్ స్కూల్‌లో శ్వాసకోస నిపుణుడు పాల్ ఈ మారిక్ స్పష్టం చేశారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ మందును కోవిడ్​ చికిత్స ప్రామాణిక జౌషధాల్లో చేర్చాలని కోరుతున్నామని.. తద్వారా మహమ్మారికి చెక్​ పెట్టవచ్చని FLCCC నిపుణుల బృందం తెలిపింది.
Published by:Krishna Kumar N
First published: