హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Itel A24 Pro Price: మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర రూ.5 వేల కన్నా తక్కువే!

Itel A24 Pro Price: మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర రూ.5 వేల కన్నా తక్కువే!

Itel A24 Pro Price: మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర రూ.5 వేల కన్నా తక్కువే!

Itel A24 Pro Price: మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర రూ.5 వేల కన్నా తక్కువే!

New Smartphone | ఐటెల్ కంపెనీ బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ధర మాత్రం రూ. 5 వేల కన్నా తక్కువ గానే ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

New Phone | ఐటెల్ కంపెనీ ఏ24 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. కాంపాక్ట్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. ఇందులో పలు బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో (Phone) 5 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. స్టోరేజ్ 32 జీబీ ఉంటుంది. ఈ ఫోన్ రేటు రూ. 4,600. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ యూనిసెక్ ఎస్‌సీ9832ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో (Smartphone) ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 0.3 ఎంపీ కెమెరా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. అలాగే 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయ్యింద. త్వరలోనే మన దేశంలోకి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మన దేశంలో ఇప్పటికే రూ. 5 వేల రేంజ్‌లో పలు రకాల స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో ఈ ధరలో ఫోన్లను సెర్చ్ చేయొచ్చు. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఊరించే ఆఫర్.. రూ.999కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

మార్‌క్యూ దగ్గరి నుంచి జియో వరకు పలు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నాయి. రూ. 5 వేల కన్నా తక్కువే ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ కూడా వాడొచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ తొలి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 5,999. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 4499కే కొనొచ్చు. ఈ ఫోన్‌లో 5.45 అంగుళాల స్క్రీన్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కి.మి వెళ్లొచ్చు, కిలోమీటర్‌కు 7 పైసలు ఖర్చు.. మతిపోగొడుతున్న కొత్త ఇబైక్స్!

ఐటెల్ నుంచి మరో ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని పేరు ఐటెల్ ఏ23 ప్రో. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 4,999. అయితే దీన్ని అమెజాన్‌లో రూ. 3899కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్ల ఉన్నాయి. ఐటెల్ నుంచి మరో ఫోన్ కూడా తక్కువ ధరకే వస్తోంది. దీని పేరు ఏ25. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5078గా ఉంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 5 అంగుళాల స్క్రీన్, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐకాల్ జెడ్2 ఫోన్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 6499గా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 4749కే కొనొచ్చు.

First published:

Tags: Itel, New phone, New smartphone, Smartphone

ఉత్తమ కథలు