ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ సంస్థ నుంచి కొత్త ప్రొడక్ట్స్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా అని చాలమంది మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తుంటారు. అలాగే యాపిల్ నుంచి కొత్త మోడల్ ఫోన్ వస్తుందంటే అందులో ఏయే ఫీచర్స్ ఉంటాయో, ఎంత ధర పలుకుతుందో తెలసుకోవడాని కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ యాపిల్ సంస్థకు భారీ జరిమానా విధించింది. యాపిల్ ఫోన్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలు అనుసరించినందుకు గాను 10 మిలియన్ యూరోస్ జరిమానా విధిస్తున్నట్టు చెప్పింది. యాపిల్ సంస్థ పలు మోడళ్ల ఫోన్లపై ఎటువంటి వివరణలు లేకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది.
నీరు, ఇతర ద్రవాల్లో పడి దెబ్బతిన్న ఫోన్లు వారంటీ పరిధిలోకి రావని.. వాటికి ఎలాంటి సహకారాన్ని అందించలేదని యంటీట్రస్ట్ తెలిపింది. యాపిల్ సంస్థ ఇలా చేయడం వినియోగదారులను మోసం చేయడమేనని పేర్కొంది. యాపిల్ సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ ఇటలీలోని యాంట్రీట్రస్ట్ అథారిటీ తీసుకున్న నిర్ణయం పలువురుని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీనిపై స్పందించడానికి యాపిల్ సంస్థ నిరాకరించింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.