• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ISROS PSLV C49 EOS 01 MISSION SUCCESSFUL 10 SATELLITES PLACED IN ORBIT BA

ISRO: శ్రీహరికోట నుంచి PSLV C-49 రాకెట్ ప్రయోగం సక్సెస్, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే

ISRO: శ్రీహరికోట నుంచి PSLV C-49 రాకెట్ ప్రయోగం సక్సెస్, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే

PSLV c49 ప్రయోగం విజయవంతం

PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో జరిపిన ప్రయోగం సక్సెస్ అయింది.

  • Share this:
    PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో జరిపిన ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ ద్వారా నింగిలోకి పది ఉపగ్రహాలను పంపారు. ఈఓఎస్‌-01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా మిగతా ఎవ్వరికీ ఇస్రో అనుమతించ లేదు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం. ఈ శాటిలైట్ ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. ఈరోజు లాంచ్ చేశారు.

    వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం 3.02 గంటలకు రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో అది 10 నిమిషాలు వాయిదా పడింది. లాంచ్‌కు ముందు మెరుపులు రావడంతో రాకెట్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలకు నష్టం జరుగుతుందని భావించి 10 నిమిషాలు ఆలస్యంగా లాంచ్ చేశారు. నింగిలోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కక్ష్యలోకి (ఈఓఎస్‌–01)ను ప్రవేశపెట్టింది.

    రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. రాకెట్ సక్సెస్ అనంతరం ఇస్రో చైర్మన్ కె. శివన్ మాట్లాడుతూ ఇస్రోకు ఇది ప్రత్యేకమైంది. అసాధారణమన మిషన్ అని అన్నారు. ‘అంతరిక్ష ప్రయోగాలు అనేవి ఇంటి నుంచి చేయలేం. ముఖ్యంగా లాంచింగ్ సమయంలో ప్రతి ఇంజినీర్, టెక్నీషియన్, ఇతర ఉద్యోగులు ఇతర దేశాల నుంచి కూడా షార్ అంతరిక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అలాగే, చాలా ముఖ్యమైన హార్డ్‌వేర్‌ను కూడా ఇక్కడకు సరైన సమయంలో చేర్చాల్సి ఉంటుంది. కరోనా సమయంలో మా ఇస్రో టీమ్ లిమిటెడ్ స్టాఫ్‌తో పనిచేసింది. ప్రభుత్వం విధించిన అన్ని ప్రోటోకాల్స్ పాటించింది. అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా పనిచేసింది.’ అని శివన్ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు