• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ISRO TO SEND BHAGAVAD GITA PHOTO OF PM NARENDRA MODI NAMES OF 25000 CITIZENS TO SPACE THROUGH A PRIVATE SATELLITE NK

ISRO: అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో, 25వేల మంది పౌరుల పేర్లు... ఎందుకు?

ISRO: అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో, 25వేల మంది పౌరుల పేర్లు... ఎందుకు?

అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో, 25వేల మంది పౌరుల పేర్లు (ప్రతీకాత్మక చిత్రం)

ISRO: భారత రోదసీ ఘట్టాల్లో మరో ఆసక్తికర సందర్భం ఇది. దేశ ప్రజలంతా దీన్ని ఆశ్చర్యంగా, ఉత్సుకతతో చూస్తున్నారు. ఇస్రో ఎందుకిలా చేస్తోందో తెలుసుకుందాం.

  • Share this:
    ఈ నెలాఖరున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో (ISRO) ప్రయోగించే ఓ చిన్న శాటిలైట్... తనతోపాటూ... భగవద్గీత కాపీ, ప్రధాని నరేంద్రమోదీ ఫొటో, 25,000 మంది వ్యక్తుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. ఈ శాటిలైట్‌కి సతీష్ ధావన్ శాటిలైట్ లేదా SD SAT అని పేరు పెట్టారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో తొలి తరం శాస్త్రవేత్తల్లో సతీష్ ధావన్ ఒకరు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను భూ కక్ష్యా మార్గంలో విడుస్తారు. గతేడాది ఇస్రో... IN-స్పేస్ అనే ఓ కొత్త సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ఇస్రో... బయటి ప్రైవేట్ సంస్థలు తయారుచేసే శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా... 2 శాటిలైట్లను ఇండియాలోని రెండు స్టార్టప్ సంస్థలు తయారుచేశాయి. వాటిని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ ఘట్టం ద్వారా... ఇస్రో కార్యకలాపాల్లో ప్రైవేట్ సంస్థలు కూడా పాలుపంచుకున్నట్లు అవుతుంది.

    "మేం మిషన్ పూర్తి చేశాక... ప్రజలను పేర్లు ఇమ్మని అడిగాం వాటిని అంతరిక్షంలోకి పంపుతామని చెప్పాం. వారంలోపే మేం 25,000 పేర్లు పొందాం. వాటిలో 1000 పేర్లు ఇండియా బయటి నుంచి వచ్చాయి. చెన్నైలో ఓ స్కూల్ ఉంది. అది ప్రతి ఒక్కరి పేరునూ పంపబోతోంది. ఇలా ఎందుకంటే... ప్రజలకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కలిగించేందుకే." అని స్పేస్ కిడ్జ్ ఇండియా సీఈఓ, సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సీమర్తి కేసన్ తెలిపారు.


    మరి భగవద్గీతను ఎందుకు పంపుతున్నారంటే... ఇప్పటికే విదేశాలకు చెందిన కొన్ని శాటిలైట్లు... బైబిల్ వంటి పవిత్ర గ్రంథాల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాయి. చందమామపై ల్యాండ్ అయిన అపోలో 11 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగామి బుజ్ ఆల్డ్రిన్... తనతోపాటూ ఓ బైబిల్ తీసుకెళ్లిన విషయం ఈమధ్యే బయటపడింది. ఇలా ప్రపంచంలో భూమిపై కాకుండా ఇతర ఖగోళంపై మత గ్రంథాన్ని ఉంచిన వ్యక్తిగా ఆయన చరిత్రకెక్కారు.

    "ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను ఎందుకు పంపుతున్నామంటే... ఆయన కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆత్మనిర్భర భారత్ అనే పిలుపు ఇచ్చారు. ఈ కొత్త శాటిలైట్లు పూర్తిగా ఇండియాలో తయారైనవి. వీటిలో ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇండియాలో చేసినవే. అందువల్ల ఆయన ఫొటో పెడుతున్నాం" అని కేసన్ తెలిపారు.

    ఇది కూడా చదవండి: నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు.. పూజలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ

    స్పేస్ కిడ్జ్ ఇండియా శాటిలైట్‌లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. 1. రోదసీ రేడియేషన్ పరిశోధనకు. 2.మాగ్నెటోస్పియర్ పరిశోధనకు. 3.లో పవర్ వైడ్ ఏరియా కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని కల్పించేందుకు. మొత్తానికి ఈ ఫొటోలు, శాటిలైట్ల అంశం దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు