నేడు ఇస్రో మరో ప్రయోగం... నాలుగు శాటిలైట్లతో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ - సీ 44

ISRO : కొత్త సంవత్సరంలో భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్న ఇస్రో... కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. గురువారం రాత్రి పీఎస్‌ఎల్‌వీ – సీ 44 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ కొనసాగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 24, 2019, 11:56 AM IST
నేడు ఇస్రో మరో ప్రయోగం... నాలుగు శాటిలైట్లతో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ - సీ 44
ఇస్రో పీఎస్‌ఎల్‌వీ (ఫైల్ ఫొటో)
  • Share this:
కొత్త సంవత్సరంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నేటి రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 44 ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించి బుధవారం రాత్రి 7:37 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. కౌంట్‌డౌన్ 28 గంటలు గడిచాక పీఎస్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాం శాట్‌తో పాటు మైక్రోశాట్-ఆర్ రెండు చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపనున్నారు. ఇదివరకు భారీ ఉపగ్రహాల్ని పంపేందుకు పీఎల్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ తరహాలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లను అమర్చేవారు. ఈసారి మాత్రం రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ అనే పేరు పెట్టారు.ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండటంతో ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్‌ను పంపనున్నట్లు ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఇస్రో అధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్ కోసం కొత్త స్కీం తెచ్చామన్న ఆయన... 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్ని జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి వాళ్లకు ఇస్రోలో ట్రైనింగ్ ఇస్తామన్నారు.Video : ఈ ఏడాది 37 రాకెట్ ప్రయోగాలు : ఇస్రో
Published by: Krishna Kumar N
First published: January 23, 2019, 6:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading