పీఎస్‌ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతం... నింగిలోకి నిఘానేత్రం

#PSLVC45 : 27 గంటల కౌంట్ డౌన్ కొనసాగింది. సోమవారం ఉదయం 9.27కి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది.

news18-telugu
Updated: April 1, 2019, 12:14 PM IST
పీఎస్‌ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతం... నింగిలోకి నిఘానేత్రం
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూపొందించిన అడ్వాన్డ్‌ రీట్రేడింగ్‌ పొటెన్షియల్‌ అనలైజర్‌ ఫర్‌ లోనో స్పెరిక్‌ స్టడీస్‌ పరికరం ఐనోస్పియర్‌ పొరపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడనుంది. (Image:ISRO Twitter)
  • Share this:
మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ISRO) నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45 సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్‌డౌన్‌, ప్రయోగ రిహార్సల్స్‌ చేశారు. షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రాకెట్‌ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశ పెట్టారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.

అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. మిగిలిన నాలుగో దశ రాకెట్‌ (పీఎస్-4)ను సైంటిస్టులు ప్రయోగాత్మకంగా 3వ కక్ష్యలోకి (485 కిలోమీటర్ల ఎత్తులో) తీసుకెళ్లబోతున్నారు. ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్‌ ఐడింటికేషన్‌ సిస్టమ్‌ ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది .రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఆటోమ్యాటిక్‌ పాకెట్‌ రిపెరింగ్‌ సిస్టమ్‌ రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూపొందించిన అడ్వాన్డ్‌ రీట్రేడింగ్‌ పొటెన్షియల్‌ అనలైజర్‌ ఫర్‌ లోనో స్పెరిక్‌ స్టడీస్‌ పరికరం ఐనోస్పియర్‌ పొరపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడుతుంది.

Pics : ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతం... నింగిలోకి 29 శాటిలైట్లు... ప్రత్యేకతలు ఇవీ...
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading