ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...

ISRO : రాకెట్ ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో... మరో ఘనత సాధించింది. రీశాట్-2బీ ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 6:17 AM IST
ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ46 (Image : ANI / Twitter)
  • Share this:
అంతరిక్ష ప్రయోగాల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ - ఇస్రో... మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 5.30కి PSLV-C46 రాకెట్ ద్వారా... రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి... కక్ష్యలో ప్రవేశపెట్టింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ... అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రం నుంచి తెల్లవారు జామున 5.30 గంటలకు సీఎస్ఎల్వీ-సీ46 రాకెట్‌ విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో... 48వ PSLV రాకెట్‌ను వాడినట్లైంది. ఇందుకోసం ప్రత్యేకంగా బూస్టర్లు లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే కోర్‌ అలోన్‌ (PSLV-CA) రాకెట్‌ను ఎంచుకుంది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి. ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. అర్ధరాత్రి ఇంధనం నింపే పని పూర్తి చేశారు. ఆపై ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని పరిశీలించి, ప్రయోగానికి 15 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ అధీనంలోకి తీసుకెళ్లారు.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ46 (Image : ANI / Twitter)

ఆకాశంలో ఇస్రో కన్ను : ప్రయోగం మొదలైన 15.29 నిమిషాలకు భూమి నుంచి 558 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్ చేరుకుంది. భూమధ్య రేఖకు 37 డిగ్రీల వాలులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో రీశాట్‌-2బీని వదిలిపెట్టింది.

isro,chandrayan 2, isro live,isro launch,isro satellite launch,isro news,isro latest news,sriharikota,isro india,isro notes,isro emisat,gsat 11 isro,isro vs nasa,indian isro,isro channel,isro pslv c46,isro gk notes,pslv-c45 isro,isro pslv-c45,tips for isro,isro scientist,isro gaganyaan,isro exam notes,gk notes for isro,isro launch 2019,isro man mission,satellites & isro,isro preparation,isro chief k sivan,ఇస్రో,రాకెట్ ప్రయోగం,చంద్రయాన్ 2,ఇస్రో శాటిలైట్,ఇశ్రో,
రాకెట్ నుంచీ విడిపోయిన రీశాట్-2బీ ఉపగ్రహం - ఆన్‌బోర్డ్ కెమెరా తీసిన చిత్రం (Image : Isro / Twitter)

ఈ ఉపగ్రహాన్ని ఆకాశంలో ఇస్రో కన్నుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులపై అనుక్షణం కన్నేస్తూ ఉగ్రవాద శిబిరాలు, వాది కదలికలను పసిగట్టి ఫొటోలు పంపిస్తు్ంది. అలాగే దేశంలోని వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో ఉపయోగపడనుంది. మేఘాలు ఉన్నా అన్ని వేళలా స్పష్టమైన ఫొటోలు తీసిపంపగలదు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.

isro,chandrayan 2, isro live,isro launch,isro satellite launch,isro news,isro latest news,sriharikota,isro india,isro notes,isro emisat,gsat 11 isro,isro vs nasa,indian isro,isro channel,isro pslv c46,isro gk notes,pslv-c45 isro,isro pslv-c45,tips for isro,isro scientist,isro gaganyaan,isro exam notes,gk notes for isro,isro launch 2019,isro man mission,satellites & isro,isro preparation,isro chief k sivan,ఇస్రో,రాకెట్ ప్రయోగం,చంద్రయాన్ 2,ఇస్రో శాటిలైట్,ఇశ్రో,
ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తిగా చూస్తున్న విద్యార్థులు (File)

ఇక భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్‌-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తిరుమలలో తెలిపారు. ఈ ప్రయోగం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్న ఆయన... సెప్టెంబరు 6న చంద్రుడిపై చంద్రయాన్‌-2 రోవర్‌ దిగుతుందని వివరించారు. ఈ సంవత్సరం మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నట్లు తెలిపారు. 

ఇవి కూడా చదవండి :

Photos : అమాయక చూపులతో కట్టిపడేస్తున్న ముంబై బ్యూటీ...

జబర్దస్త్ రష్మి లాగా కనిపించే కేరళ బ్యూటీ ఫొటోస్...
First published: May 22, 2019, 5:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading