Chandrayaan-2 : ఈ నెల 20 వరకూ ఇస్రోకి నిద్రలేని రాత్రులే... ఎందుకంటే...

Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ ఆగిపోయినా... రెండు వారాలపాటూ... సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇస్రో. ఆ తర్వాతేంటి? రెండు వారాలే ఎందుకు?

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 7:41 AM IST
Chandrayaan-2 : ఈ నెల 20 వరకూ ఇస్రోకి నిద్రలేని రాత్రులే... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 7:41 AM IST
ISRO Chandrayaan-2 : మనకు తెలుసు... చంద్రయాన్-2 ప్రయోగంలో భాగమైన... విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్... ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం చందమామపై దిగివుంటే... అవి రెండు... 14 రోజులపాటూ పనిచేసేవి. ఆ రెండు వారాలూ... అవి సూర్యుడి నుంచీ వచ్చే వేడిని తీసుకొని... సోలార్ పవర్ జనరేట్ చేసుకొని పనిచేసేవి. చందమామను ఫొటోలు తీసి ఇస్రోకి పంపేవి. ఐతే... ప్లాన్ తేడా రావడంతో... విక్రమ్ ల్యాండర్‌కి ఏమైందనేది తెలుసుకునే పనిలో పడ్డారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఏ క్షణమైనా దాన్ని నుంచీ సిగ్నల్స్ వస్తాయేమోనని ఆశగా చూస్తున్నారు. ఐతే... ఈ ఆశలు రెండు వారాల వరకే ఉంటాయి. 14 రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. విక్రమ్ ల్యాండర్ దిగిన చోట... సూర్య కిరణాలు పడటం మానేస్తాయి. అందువల్ల విక్రమ్ ల్యాండర్‌కి సోలార్ పవర్ ఆగిపోతుంది. అందువల్ల అది నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుంది.

సెప్టెంబర్ 20 తర్వాత... 14 లేదా 15 రోజులపాటూ... విక్రమ్ ల్యాండర్‌పై సూర్య కిరణాలు పడవు. ఈ సమయలో... అది ఉన్న ప్రదేశంలో వాతావరణం మైనస్ 153 డిగ్రీలకు పడిపోతుంది. అంటే... విక్రమ్ ల్యాండర్ పూర్తిగా గడ్డకట్టిపోతుంది. ఎంతలా అంటే... ఆ మంచుగడ్డను సుత్తితో కొట్టిన పగలదు. అంత బలంగా మంచు గడ్డకడుతుంది. అది రెండు వారాలపాటూ... అలాగే ఉంటుంది. అందువల్ల విక్రమ్ ల్యాండర్ పాడైపోయే అవకాశాలున్నాయి. అక్టోబర్ 5 లేదా 6 నుంచీ... విక్రమ్ ల్యాండర్‌పై తిరిగి ఎండ పడుతుంది. కానీ... ఇన్ని రోజులూ నిద్రాణంలో ఉండిపోవడంతో... ఇక ల్యాండర్ పనిచేసే అవకాశాలు తక్కువ.

ఈ కారణంగానే... ఇస్రో శాస్త్రవేత్తలు... సెప్టెంబర్ 20 వరకూ ఆశలు పెట్టుకున్నారు. ఆలోగా ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ వస్తే సరేసరి... లేదంటే... ఇక దానిపై ఆశలు వదులుకుంటారు. నెక్ట్స్ ప్రాజెక్టులవైపు దృష్టిసారిస్తారు. ఒకవేళ ల్యాండర్ స్పందిస్తే... సిగ్నల్స్ పంపిస్తే... అప్పుడు దాని పరిస్థితి ఏంటి, పనిచేస్తోందా? దాన్లోంచీ... ప్రజ్ఞాన్ రోవర్‌ను బయటకు తెచ్చి... చందమామపై నడిపేందుకు వీలవుతుందా... వంటి అంశాల్ని పరిశీలిస్తారు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...